'118' మూవీ రివ్యూ

118 మూవీ రివ్యూ
x
Highlights

చిత్రం: 118 నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేద థామస్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ...

చిత్రం: 118

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేద థామస్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు

సంగీతం: శేఖర్ చంద్ర

ఛాయాగ్రహణం: కేవీ గుహన్

ఎడిటింగ్‌: తమ్మిరాజు

నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు

దర్శకత్వం: కేవీ గుహన్

బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్

విడుదల తేదీ: 01/03/2019

ఈ మధ్యకాలంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒక మంచి హిట్ అందుకొని చాలా రోజులైంది. చాలా కాలం తర్వాత ఒక కంప్లీట్ ప్రేమకథతో 'నా నువ్వే' అనే సినిమాతో మన ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లో రెండు భాగాలలో తన తండ్రి ఎన్టీఆర్ హరికృష్ణ పాత్రను పోషించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మళ్ళీ హీరోగా '118' సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ ఈ సినిమాతో తెలుగులో దర్శకుడిగా మారాడు. మహేష్ ఎస్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా ను నిర్మించారు. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ శాలిని పాండే మరియు నివేదా థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ట్రైలర్ తోనే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా మార్చి ఒకటవ తేదీన విడుదలైన. ఈ సినిమా పై నందమూరి అభిమానులు మాత్రమే కాక కళ్యాణ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా.

కథ:

గౌతమ్ (కల్యాణ్ రామ్) ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు. అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడం అంటే మహా ఇష్టం అతనికి. మేఘా (షాలిని పాండే)ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ప్రతీ పౌర్ణమి రోజున ఆద్య (నివేదా థామస్) అనే అమ్మాయి దాడికి గురైనట్టు గౌతమ్ కి కల వస్తూ ఉంటుంది. కలలో కనిపించిన ఆ అమ్మాయి ఉన్న ప్రాంతాలు గౌతమ్‌కు నిజ జీవితంలో కూడా తారసపడుతాయి. దాంతో ఆద్య నిజంగానే ఉందని అనుకుని తన కోసం వెతుకులాట మొదలుపెడుతాడు. ఆ క్రమంలో కొన్ని భయంకర నిజాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటాడు గౌతమ్. ఆద్య నిజంగానే గౌతమ్ కి తారసపడిందా? ఒకవేళ కలిస్తే ఆద్యను గౌతమ్ ఎలా కలుసుకున్నారు? ఆద్య మీద దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆద్య కోసం వెతికే క్రమంలో గౌతమ్ కలిసే ప్రతీ వ్యక్తి ఎందుకు చనిపోతారు? చివరికి ఆద్యకు ఎం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే '118' సినిమా తెరపై చూడాల్సిందే.

నటీనటులు:

ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ నటన అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నటన హైలైట్ గా మారింది. రొమాంటిక్ సన్నివేశాల్లో నే కాకా యాక్షన్ సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ నటించిన విధానం అందర్నీ మెప్పిస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశంలో కళ్యాణ్ రామ్ తన నటనతో అదరగొట్టాడు అని చెప్పుకోవచ్చు. కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కళ్యాణ్ రామ్ ఏమాత్రం బోర్ కొట్టించకుండా కథను ముందుకు తీసుకు వెళ్ళాడు. హీరోయిన్లు ఇద్దరూ సినిమాకు సరిగ్గా సూటయ్యారు. శాలిని పాండే సీన్లు తక్కువే అయినప్పటికీ ఆమె నటన చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ రామ్ తో సన్నివేశాలు చాలా బాగుంటాయి. నివేదాథామస్ కు ఈ సినిమాలో పర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఈ అవకాశాన్ని ఏ మాత్రం వృధా కానివ్వకుండా నివేదాథామస్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ను కనబరిచింది. ఈ సినిమాలో ఆమె నటన కచ్చితంగా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. సినిమా మొత్తం దాదాపు అన్ని సీన్ల లో కళ్యాణ్ రామ్ పక్కనే ఉంటూ ప్రభాస్ సీను నటన చాలా బాగుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు చాలా మంచి పాత్ర దక్కింది. డాక్టర్గా నాజర్ నటన సినిమాలో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎప్పటిలాగానే రాజీవ్ కనకాలకు ఈ సినిమాలో కూడా ఒక ఆసక్తికరమైన పాత్ర లభించింది. రాజీవ్ కనకాల కూడా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా నటీనటులు కూడా తమకున్న స్కోప్ లో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో దర్శకుడు కె.వి గుహన్ కథకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. కొత్తగా మరియు ఆసక్తికరంగా రచించారు కె.వి.గుహన్. సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయే వరకు ప్రేక్షకులలో ఆసక్తిని మెయింటెన్ చేయడం అంత సులువైన విషయం కాదు కానీ '118' సినిమాతో దీన్ని సాధించారు గుహన్. ఎక్కడా బోరు కొట్టకుండా కొత్తగా మరియు ఆసక్తికరంగా కథను తీర్చిదిద్దిన విధానం సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ అందరికీ అర్థమయ్యే విధంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడిగా మాత్రమే కాక సినిమాటోగ్రాఫర్ గా కూడా ఈ సినిమాలో తన పనితనాన్ని కనబరిచారు. ఈ సినిమాలో విజువల్స్ చాలా బాగా వచ్చాయి అంటే దానికి కారణం గుహన్ అని చెప్పుకోవచ్చు. మహేష్ ఎస్ కోనేరు అందించిన నిర్మాణ విలువలు సినిమాకు బాగా పనికొచ్చాయి. శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఈ సినిమాకి బాగానే సెట్ అయింది. తమ్మిరాజు ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

బలాలు:

నివేదా థామస్ పెర్ఫార్మెన్స్

కల్యాణ్ రామ్ నటన

సినిమాటోగ్రఫి

ప్రొడక్షన్ వ్యాల్యూస్

బలహీనతలు

బలమైన కథ లేకపోవడం

కథనం

స్లో నేరేషన్

చివరి మాట:

రొటీన్‌ ఫార్ములా కు భిన్నంగా ఓ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కేవీ గుహన్. ఆసక్తికరమైన పాయింట్‌ తో సినిమాను మొదలుపెట్టి తన ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. అనవసరమైన సన్నివేశాలను హైలైట్ చేయకుండా సినిమా అంతా ఓకె మూడ్‌లో సాగుతుంది. ఫస్ట్‌ హాఫ్ ఫాస్ట్ గా థ్రిల్లింగ్‌ సీన్స్‌తో గడిచిపోగా, ద్వితీయార్థంలో కాస్త స్లో చేశాడు గుహన్. అయితే ప్రీ క్లైమాక్స్‌ లో కొంచెం లాజిక్‌ను పక్కన పెట్టినట్టు అనిపించింది.

బాటమ్ లైన్:

'118' అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే థ్రిల్లర్.

Show Full Article
Print Article
Next Story
More Stories