బాహుబలి తర్వాత ఆ రికార్డ్ స్పైడర్‌దే

Submitted by lakshman on Wed, 09/13/2017 - 15:43

మహేశ్ బాబు హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం స్పైడర్. విడుదలకు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. అమెరికాలో 400 స్క్రీన్స్‌లో స్పైడర్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత యూఎస్‌లో అత్యధిక స్క్రీన్స్‌పై కనువిందు చేయనున్న చిత్రం ఇప్పటికి స్పైడరే కావడం గమనార్హం. బాహుబలి2 అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌కు పైగా విడుదలయింది. స్పైడర్ సినిమా అమెరికాలో తొలి రోజు 2మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. మొత్తం మీద 10మిలియన్ డాలర్ల కలెక్షన్ పక్కా అని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అమెరికా బాక్సాఫీస్‌లో మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించిన తొలి సినిమా దూకుడు కావడం విశేషం.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కాబోతోంది. మహేశ్ తొలి తమిళ సినిమా కూడా ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథను నమ్ముకుని సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా మురుగదాస్‌కు మంచి పేరుంది. దీంతో మహేశ్ అభిమానులు సినిమా పక్కా హిట్ అనే ధీమాతో ఉన్నారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ దాదాపు 120 కోట్ల వ్యయంతో స్పైడర్ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 27న స్పైడర్ చిత్రం విడుదల కాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో తొలిసారి నటించిన జైలవకుశ చిత్రం కూడా సెప్టెంబర్ 21న విడుదలవనుంది.
 

English Title
mahesh spyder is ready to release huge screens in US

MORE FROM AUTHOR

RELATED ARTICLES