Pregnant Women Diet: గర్భిణులు ఈ 3 పప్పులను డైట్‌లో చేర్చుకోవాలి.. వీటివల్ల ఈ ప్రయోజనాలు లభిస్తాయి

Pregnant Women Should Include These 3 Pulses In Their Diet They Get These Benefits
x

Pregnant Women Diet: గర్భిణులు ఈ 3 పప్పులను డైట్‌లో చేర్చుకోవాలి.. వీటివల్ల ఈ ప్రయోజనాలు లభిస్తాయి

Highlights

Pregnant Women Diet: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

Pregnant Women Diet: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. కచ్చితంగా పోషకాహారం తీసుకోవాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైమ్ మహిళలకు సవాళ్లతో కూడుకున్నది. సరైన ఆహారం తీసుకోవడం వల్ల మహిళలు గర్భధారణ సమయంలో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

గర్భధారణ సమయంలో స్త్రీలు మహిళలు ఆహారంలో పండ్లు, కూరగాయలతో పాటు పప్పులను కూడా చేర్చుకోవాలి. దీంతో వారికి ప్రొటీన్‌తోపాటు అన్ని రకాల పోషకాలు అందుతాయి. గర్భధారణ సమయంలో పప్పులు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పెసరపప్పు

పప్పుధాన్యాల్లో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. పెసరపప్పు అత్యంత ప్రయోజనకరమైన పప్పు. గర్భధారణ సమయంలో తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో కొవ్వు తక్కువ పరిమాణంలో ఉంటుంది. కానీ ఫైబర్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల మలబద్ధకం సమస్యలు నయమవుతాయి.

కందిపప్పు

కాయధాన్యాలు గర్భిణీలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కందిపప్పులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. గర్భధారణ సమయంలో కందిపప్పు తింటే రక్తహీనత రాదు. అందువల్ల ఆహారంలో కందిపప్పును చేర్చుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories