CoronaVirus: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?

Pranayama is Protect Covid 19
x

కరోనా నుంచి ఎలా రక్షణ పొందాలి

Highlights

CoronaVirus: నిరంతర వ్యాయామంతో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ వస్తుంది. దాంతో అందం, ఆరోగ్యం మన సొంత అవుతుంది.

CoronaVirus: నిరంతర వ్యాయామంతో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ వస్తుంది. దాంతో అందం, ఆరోగ్యం మన సొంత అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో మనం ఫిజకల్, మెంటల్ ఫిట్ నెస్ ల పై ఖచ్చితంగా చర్చించుకోవాల్సిందే. కారణం కరోనా వైరస్ భారత్‌ను చుట్టుముట్టి, ఊపిరాడనివ్వడం లేదు. మునుపెన్నడూ లేనంత ఉద్ధృతితో ప్రభుత్వాలు, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక రోజులో మూడు లక్షలకు పైగా కేసులు, రెండు వేలకు పైగా మరణాలతో దేశంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. నిరంతర వ్యాయామంతో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కలిగి ఉన్న వాళ్లనూ కొవిడ్‌ వదలడం లేదు. అయితే ఇలాంటి సమయంలోనూ క్రమం తప్పక వ్యాయామం చేసేవారికి కొవిడ్‌ సోకినా, వారు కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యాయామం మనేది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో అవసరం. అందుకు ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

కొవిడ్‌ మొదటి దశలో ఒకరికి వైరస్‌ వస్తే ఇతరులకు సోకేందుకు 7-8 రోజులు పట్టేది. ప్రస్తుతం 2-3 రోజులకే ఇంటిల్లిపాదీ బాధితులవుతున్నారు. దీన్ని తామెలా తట్టుకోవాలన్న ఆందోళన మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనావైరస్‌ సోకుతుందేమోననే గుబులు, వస్తే ఎలా అనే భయం, కోలుకున్నాక భవిష్యత్తు ఆరోగ్యంపై బెంగ వంటి అంశాలపై చాలామంది మదిని తొలిచేస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ముందు మనం మనసుని స్థిమిత పరుచుకోవాలి. ప్రతికూల ఆలోచనలు చేయకుండా శాస్త్రీయంగా ఆలోచించాలి. అంటే వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ మన ఆలోచనలు సాగాల్సి వుంటుంది. అలాగే వ్యాధి నిరోధకశక్తి పెరగాలంటే మనసును దృఢంగా ఉంచుకోవాలి. వైరస్‌ను ఎదుర్కొనేందుకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అంతే కీలకం.

క్రమం తప్పక వ్యాయామం చేసేవారు, లేదా రోజుకు 30 నిమిషాలకు తగ్గకుండా బ్రిస్క్‌ వాక్‌ చేసేవారు ఆ అలవాటు లేని వారి కంటే త్వరగా కొవిడ్‌ నుంచి కోలుకుంటారని పలు అధ్యయనాల్లో తేలింది. వ్యాయామం చేసే అలవాటు లేని వారికి కొవిడ్‌ సోకితే, ఐసియులో అడ్మిట్‌ అయ్యే అవకాశాలు 1.73 రెట్టు ఎక్కువ అని, అలాగే కొవిడ్‌ ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం కూడా 2.49 రెట్లు ఎక్కువ.

60 ఏళ్లు పైబడిన పెద్దలు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, దీర్ఘకాలం పాటు మంచానికే పరిమితమైనవాళ్లకు కొవిడ్‌ ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అడుగుపెట్టిన ప్రస్తుత సమయంలో, దీన్నుంచి రక్షణ పొందడం కోసం వీలైనంత మేరకు ఇంటి పట్టునే వ్యాయామం చేయడం మంచిది. దైనందిన జీవితంలో వారంలో కనీసం ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా 30 నిమిషాలకు తగ్గకుండా వేగంగా నడవడం భాగం చేసుకోవాలి.

లావుగా ఉన్నవారే కాదు.. సన్నగా ఉన్నవారు కూడా వ్యాయామం చేయడం అవసరమే.. ఎందుకంటే. వ్యాయామం చేయడం వలన శరీరంలో ఫీల్‌ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. అలానే క్యాలరీలు కరగడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. మృతకణాలు పేరుకోకుండా ఉంటాయి. చర్మం తాజాగా మారుతుంది. చిన్న వయసు నుంచి వ్యాయామం చేయడం వలన భవిష్యత్తులో మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

కరోనా ముప్పును అధిగమించాలంటే మనం నిత్యం ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడం వల్ల లంగ్స్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. కరోనా వైరస్ ముఖ్యంగా మన దేహంలోని ఉపిరితిత్తులపై దాడి చేస్తుంది. ప్రతిరోజు ఒక ఆరగంట ప్రాణాయామం వల్ల శ్వాస సరిగ్గా తీసుకుంటారు. అక్సిజన్ మీ శరీరంలోని ప్రతి అవయవానికి చేరుకుంటుంది.

ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలోని 80,000 నరాలు శుద్ధి అవుతాయి. ఇలా శుద్ధి అవ్వడం వల్ల మన శరీరంలోని ఎనర్జీ ఫ్లో బాలన్స్ అవుతుంది. ప్రాణాయామం మీకు శారీరక దృఢత్వాన్ని సాధించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మన మనస్సే మనం రోజు మొత్తం ఏం చేయాలి. ఎలా ఉండాలి అని నిర్దేశిస్తుంది. కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ చిట్కాలు పాటిస్తూ ఉండండి. కరోనా నుంచి రక్షణ పొందండి.

Show Full Article
Print Article
Next Story
More Stories