Radish & Mint Leaves: అందం కోసం ముల్లంగి.. అలసట తగ్గించే పుదీనా

Benefits of Radish And Mint Leaves on Skin
x

పుదీనా - ముల్లంగి (ఫైల్ ఫోటో)

Highlights

Radish and Mint Leaves: వర్షాకాలంలో చర్మ సమస్యల నుండి కాపాడుకోడానికి రకరకాల లోషన్స్, క్రీములను వాడే వారికోసం ఇంట్లోనే ఉండి ఒక చిన్న చిట్కా ద్వారా తమ...

Radish and Mint Leaves: వర్షాకాలంలో చర్మ సమస్యల నుండి కాపాడుకోడానికి రకరకాల లోషన్స్, క్రీములను వాడే వారికోసం ఇంట్లోనే ఉండి ఒక చిన్న చిట్కా ద్వారా తమ చర్మ సమస్యల నుండి కాపాడుకోవడమే కాకుండా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఎన్నో పోషక విలువలు ఉన్న ముల్లంగి తినడానికే కాకుండా చర్మం పై మొటిమలనూ పోగొట్టడమే కాకుండా అందంగా మెరవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ముల్లంగి తరుగుకు కాస్త పెరుగు, బాదం నూనెని కలిపి ముఖానికి, మెడ భాగానికి మర్దన చేసి ఒక 15 నిమిషాల తరువాత గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

పుదీనా.. పలు ఔషద గుణాలతో మానవ జీవక్రియని శరీరంలోని ఆహార వ్యర్ధాలు, మందుల తాలుకా రసాయనాల నుండి సమర్ధంగా నడిపించే పుదీనా వల్ల చాలానే లాభాలు ఉన్నాయి. పుదీనా వల్ల శారిరమ చల్ల బడటమే కాకుండా బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. ఇక పుదీనా నీటి ద్వారా జీవక్రియ చక్కగా పని చేయడమే కాకుండా కొన్ని పుదీనా ఆకులతో పాటు నిమ్మకాయ ముక్కలను ఉంచిన ఒక గ్లాసులో నీరు పోసిన ఒక గంట తరువాత ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగితే అలసటనూ ఉపశమనం పొందుతారు. పుదీనా ఆకుల వాసన మీ మెదడును కూడా ఉత్తేజితం చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories