నిద్రలో ఈ సమస్యలు ఎదురవుతున్నాయా.. అలర్ట్​గా లేకపోతే అంతే సంగతులు..!

Are you facing these problems while sleeping If neglected it is life threatening
x

నిద్రలో ఈ సమస్యలు ఎదురవుతున్నాయా.. అలర్ట్​గా లేకపోతే అంతే సంగతులు..!

Highlights

Sleeping Problems: నిద్ర అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి ఒక మందు లాంటిది.

Sleeping Problems: నిద్ర అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి ఒక మందు లాంటిది. ఒక్కరోజు నిద్రపోకపోతే ఆ మరుసటి రోజు ఎంత నలతగా ఉంటుందో అందరికి తెలుసు. ఆ రోజు ఏ పనిమీద ధ్యాస పెట్టలేరు. అయితే కొంతమంది నిద్రలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వీటివల్ల ధీర్ఘకాలికంగా ఇబ్బందిపడుతుంటారు. కానీ వీటిని తేలికగా తీసుకుంటారు. అయితే ఇవి కొన్ని రోజులకు చాలా ప్రమాదకరంగా మారుతాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది హై బీపీ పేషెంట్ల గురించి. వీరు నిద్రలో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

తలనొప్పి

కొందరు రాత్రిపూట తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. బీపీ పేషెంట్లలో ఈ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. రాత్రిళ్లు పలుమార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడమూ అధికరక్తపోటుకు సంకేతమని గుర్తుంచుకోండి. శరీరం బీపీని కంట్రోల్​ చేసే క్రమంలో ఒక్కోసారి పెరుగుతుంది మరోసారి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి బీపీ ఉన్న వాళ్లు ఉప్పు తక్కువగా తీసుకోవాలి.

గురక

బీపీ పేషెంట్లు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు. ఎందుకంటే నిద్రలో బీపీ హెచ్చ తగ్గులకు గురవుతూ ఉంటుంది. గొంతు ఆరిపోవడం, శ్వాస ఇబ్బందిగా తీసుకోవడం జరుగుతుంది. రోజుకు 5-6 గంటలకంటే తక్కువగా నిద్రపోయే వారు గుండె సంబంధిత సమస్యల బారిన పడాల్సి వస్తుంది.

నిద్రపట్టదు

బీపీ పెషెంట్లకు రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టదు. ఒక్కోసారి అర్ధరాత్రి లేచి కూర్చుంటారు. అధిక రక్తపోటు కారణంగా తలనొప్పి, ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిద్రలేమితో రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. ఇన్‌ఫ్లెక్షన్స్‌ను అడ్డుకునే శక్తి శరీరానికి ఉండదు. ఇలాంటివి ఉంటే డాక్టర్​ కలిసి మందులు తీసుకోవాలి.

మంచి నిద్రకోసం

మంచి నిద్రపట్టేందుకు ప్రతి రోజూ ఒకే టైమ్‌కి నిద్రపోవాలి. నిద్రకు ఉపక్రమించేందుకు మంచి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకూడదు. బెడ్‌రూంలో కాంతి తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories