Spice Prices: ఆకాశాన్నంటుతున్న మసాల ధరలు.. ఇక వంటగది నడపడం కష్టమే..!

After Petrol and Diesel Prices now Spice Prices have Gone Up
x

Spice Prices: ఆకాశాన్నంటుతున్న మసాల ధరలు.. ఇక వంటగది నడపడం కష్టమే..!

Highlights

Spice Prices: ఆకాశాన్నంటుతున్న మసాల ధరలు.. ఇక వంటగది నడపడం కష్టమే..!

Spice Prices: ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. చాలా రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత ఇప్పుడు వంటగది వస్తువుల ధరలు కూడా పెరిగాయి. పిండి, బియ్యం కోసం కూడా సామాన్యుడు జేబు తడుముకోవాల్సి వస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో, పిండి, బియ్యం, మసాలా దినుసులతో సహా అనేక వస్తువుల ధరలు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ వచ్చింది.

యుద్ధం ప్రారంభంతో మొదటగా ఎడిబుల్ ఆయిల్ ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగింది. తర్వాత మైదా, బార్లీ, బియ్యం, కొత్తిమీర, జీలకర్ర, పసుపు ధరలు కూడా రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పుడు మసాల దినుసుల వంతు వచ్చింది. నిత్యం వాడే మసాలా దినుసుల ధర ఆకాశానికి చేరింది. మార్కెట్‌లో పసుపు ధర 10 శాతం పెరిగింది. మరోవైపు ధనియాల ధర 20 శాతం పెరిగింది. ఇది కాకుండా జీలకర్ర ధర పెట్రోల్ ధర కంటే చాలా వేగంగా పెరిగింది. హోల్ సేల్ మార్కెట్ లో జీలకర్ర ధర కిలో రూ.230 నుంచి 235 పలుకుతోంది.

నిమ్మకాయ ధర రికార్డులకెక్కింది

మసాలా దినుసులతో పాటు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నిమ్మకాయకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో నిమ్మకాయ కొన్నిచోట్ల కిలో రూ.300 నుంచి 400 దాటింది. చాలా చోట్ల ఒక్క నిమ్మకాయ 10 నుంచి 15 రూపాయలు అమ్ముతున్నారు. దీనికి ప్రధాన కారణం డీజిల్-పెట్రోల్ ధరలు పెరగడమే. రవాణా ఖర్చులు పెరగడం, మండీలకు స్టాక్‌ తగ్గడంతో నిమ్మకాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories