రాక్షసులు, మోసగాళ్లతో యుద్ధం చేస్తున్నాం: జగన్

రాక్షసులు, మోసగాళ్లతో యుద్ధం చేస్తున్నామన్నారు వైసీసీ అధ్యక్షుడు జగన్. అనంతపురంలో వైసీపీ నిర్వహించిన సమర శంఖారావం సభలో మాట్లాడిన ఆయన నాలుగేళ్లుగా ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. అన్నివర్గాల ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామన్నారు.
వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. దొంగ ఓట్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. చంద్రబాబు ఇచ్చే 3వేలకు ఎవరూ మోసపోవద్దని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు దశల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోవాలని మూడు వేలు కాదు ఐదు వేలు ఇవ్వమనాలని, ఓటు మాత్రం వైసీపీకి వేయాలని జగన్ పిలుపు ఇచ్చారు.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT