నిజామాబాద్ లోక్ సభ ఫలితంపై ఉత్కంఠ..గంట గంటకు పెరుగుతున్న టెన్షన్

నిజామాబాద్ లోక్ సభ ఫలితంపై ఉత్కంఠ..గంట గంటకు పెరుగుతున్న టెన్షన్
x
Highlights

నిజామాబాద్ లోక్ సభ ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది హోరాహోరిగా సాగిన పోరులో గెలిచేదెవరు..? ఓడెదెవరు. ? అన్న చర్చ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. జాతీయ స్ధాయిలో...

నిజామాబాద్ లోక్ సభ ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది హోరాహోరిగా సాగిన పోరులో గెలిచేదెవరు..? ఓడెదెవరు. ? అన్న చర్చ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. జాతీయ స్ధాయిలో చర్చానీయాంశంగా మారిన ఇందూరు ఎన్నికల ఫలితంపై జాతీయ స్ధాయిలో ఆసక్తి నెలకొంది. దేశంలోనే అత్యధికంగా185 మంది అభ్యర్ధులు పోటీ చేసినా ప్రధాన పోటీ టీఆర్ఎస్-బీజేపీల మధ్యే సాగింది. గెలుపు రేసులో నువ్వా-నేనా అన్నట్లు ఇరు పార్టీలు తలపడ్డాయి. విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

నిజామాబాద్ లోక్ సభ ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీలతో పాటు జాతీయ స్ధాయిలో ఇందూరు ఫలితంపై వాడివేడి చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తన అదృష్టం మరోసారి పరీక్షించుకుంటుండగా కాంగ్రెస్ అభ్యర్దిగా మధుయాష్కీ నాలుగో సారి బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్ధిగా ధర్మపురి అర్వింద్ తొలిసారి పోటీ చేసినా అధికార పార్టీకి గట్టి పోటి ఇచ్చారు. త్రిముఖ పర్వంగా ప్రచారం కొనసాగినప్పటికీ పోలింగ్ సమయానికి పోరు ద్విముఖమైంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోలింగ్ టఫ్ ఫైట్ సాగింది. చివరి గంటలో పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అన్నది ప్రధానంగా చర్చ జరుగుతోంది.

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాలతో పాటు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలున్నాయి. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వస్తాయి...? ప్రత్యర్ధి పార్టీకి వచ్చే ఓట్లెన్ని..? పోలింగ్ సరళి తదితర అంశాలపై నివేదికలు తెప్పించుకున్న ఆయా పార్టీల అభ్యర్ధులు గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు.

ఓట్ల లెక్కింపు విధుల్లో అధికారులు మునిగిపోగా.. అభ్యర్ధుల్లో టెన్షన్ గంట గంటకు పెరుగుతోంది. ఇటు నిజామాబాద్ బాద్ షా ఎవరన్నది ఎవరూ అంచనాకు రాలేకపోతున్నారు. మొన్నటి వరకు లక్షల్లో మెజార్టీ అనుకున్న పార్టీలు సైతం ఇప్పడు గెలిస్తే చాలు అనుకునేలా పోలింగ్ సరళి సాగడంతో. ఏ పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్ధితి ప్రధాన పార్టీల్లో నెలకొంది.

2014 ఎన్నికల్లో తలపడిన నేతలే ఈ సారి మళ్లీ తలపడ్డారు. కాంగ్రెస్ నుంచి మధు యాష్కి పోటీ చేయగా. టీఆర్ఎస్ నుంచి కల్వకుంటల కవిత పోటీ చేశారు. బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ స్థానంలో ధర్మపురి అరవింద్ పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన పోటిని సైతం ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ ఇవ్వలేకపోయారు పూర్తిగా సైలెంట్ అవ్వడంతో ప్రదాన పోటి టిఆర్ఎస్, బిజెపి మద్యనే సాగింది. రెండు పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు గెలుపై దీమాతో ఉన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మైనార్టీ ఓట్లు, పెన్షన్ దారులు, మహిళల ఓట్లతో గట్టెక్కుతాననే ధీమాలో టీఆర్ఎస్ ఉండగా యువత, మున్నూరు కాపు, విద్యావంతులు, నిరుద్యోగుల ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ ఓట్లు సైతం బీజేపీకి మళ్లాయని కమల నేతలు గెలుపు పై ధీమాగా ఉన్నారు. హోరాహోరిగా ఎన్నికలు జరగడంతో ఎవరు విజేతగా నిలుస్తారన్నది రాజకీయ విశ్లేషకులకు సైతం ఓటరు నాడి అంతు చిక్కడం లేదట. ప్రభుత్వ పథకాలకు ప్రజలు జై కొట్టారా మోడీ చరిష్మా ఏమేరకు పని చేసింది అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories