కరీంనగర్ లో త్రిముఖ పోటి..! ఎంపీగా గెలిచేదేవరు ?

కరీంనగర్ లో త్రిముఖ పోటి..! ఎంపీగా గెలిచేదేవరు ?
x
Highlights

కరీంనగర్ లో ఎంపీగా త్రిముఖ పోటిగా కనిపిస్తుంది . ఇక్కడినుండి ఎవరు గెలుస్తున్నరన్నది ఇప్పుడు ప్రాధన్యతను సంతరించుకుంది . ఇక్కడి నుండి టీఆర్ఎస్ తరుపున ...

కరీంనగర్ లో ఎంపీగా త్రిముఖ పోటిగా కనిపిస్తుంది . ఇక్కడినుండి ఎవరు గెలుస్తున్నరన్నది ఇప్పుడు ప్రాధన్యతను సంతరించుకుంది . ఇక్కడి నుండి టీఆర్ఎస్ తరుపున సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ పోటి చేసారు . కాంగ్రెస్ నుండి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటి చేస్తే ఇక బీజేపి నుండి బండి సంజయ్ పోటిలో ఉన్నారు .. ముగ్గురు సీనియర్ నేతలు కావడంతో ఇక్కడ గెలుపు ఎవరిది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది .

మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో నేతల్లో టేక్షన్ మొదలయ్యింది . ఇక్కడ ఎంపీగా జెండా ఎగరేసేది ఎవరన్నది ఉత్కంటని రేకేతిస్తుంది . కరీంనగర్ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి రైల్వే అభివృద్ధి పనులు సాధించారు . అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పధకాలు కూడా తన విజయానికి కారణాలు అవుతాయని ఆయన భావిస్తున్నారు . అటు కేసీఆర్ కూడా ప్రచారంలో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే వినోద్ కుమార్ మంత్రి అవ్వోచ్చునని చెప్పుకొచ్చారు . ఇక ప్రస్తుతం తెలంగాణాలో టీఆర్ఎస్ హవా నడుస్తుండడంతో గెలుపు తమదేనని నమ్ముతున్నారు టీఆర్ఎస్ శ్రేణులు ..

ఇక కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్న నినాదంతో పొన్నం ప్రచారం సాగించారు . తెలంగాణా రావడంలో తన పాత్ర ఎంతో ఉందని కాంగ్రెస్ హయంలో తాను ఎన్నో సంక్షేమ పధకాలను ప్రజలకు అందిచనని అయన ఒటర్లను వేడుకున్నారు . ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని ప్రజలు మా వైపే ఉన్నారని పొన్నం ఆశిస్తున్నారు .

ఇక బీజేపి అభ్యర్ది బండి సంజయ్ ఎక్కువగా సానుభూతి ఓట్లతో పాటుగా హిందుత్వవాదుల ఓట్ల పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు . ఇక యూత్ మొత్తం తనవైపే ఉన్నారని ఆశిస్తున్నారు . వేములవాడ , సిరిసిల్ల మరియు హుస్నాబాద్ లాంటి ప్రాంతాల్లో బండి సంజయ్ కి మంచి పేరు ఉందని పెరిగిన ఓటింగ్ శాతం కూడా తమకి లాభం చేకూరుస్తుదని నమ్ముతున్నారు .

ఇలా ప్రస్తుతం ఎవరి గెలుపుపై వారు అంచనాలు గట్టిగానే వేసుకుంటున్నారు . అయితే ప్రజలు ఎవరివైపు నిలబడ్డారు అన్నది తెలియాలంటే మాత్రం మే 23వరకు ఆగకు తప్పదు..

Show Full Article
Print Article
Next Story
More Stories