గత ఎన్నికల్లో మోడీ వేవ్.. కానీ ఇప్పుడు సీన్ చూస్తే..

గత ఎన్నికల్లో మోడీ వేవ్.. కానీ ఇప్పుడు సీన్ చూస్తే..
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు? కలిసొచ్చిన వారణాసి సీటునుంచేనా? లేక మరో టెంపుల్ టౌన్ వెతుక్కుంటారా? ఇవేవీ కాదని సొంత గడ్డ...

ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు? కలిసొచ్చిన వారణాసి సీటునుంచేనా? లేక మరో టెంపుల్ టౌన్ వెతుక్కుంటారా? ఇవేవీ కాదని సొంత గడ్డ గుజరాత్ నుంచే బరిలోకి దిగుతారా?

2019 ఎన్నికలు ఓ విచిత్రమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయ్ మోడీ వేవ్ తో బీజెపీ గత ఎన్నికలలో ఘన విజయం సాధించింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను జయించి ఎన్నికల్లో గెలవడం పెద్ద సవాల్ లాంటిదే గత ఎన్నికల్లో మోడీ సెంటిమెంట్ తో యూపీలోని వారణాసి నుంచి ఘనమైన మెజారిటీతో గెలిచారు మోడీ కున్న పాజిటివ్ వేవ్ యూపీలో కలిసొచ్చి 80 ఎంపీ సీట్లలో ఏకంగా 71 గెలిచింది. కేంద్రంలో అధికారం దక్కాలంటే ముందు యూపీని గెలవాలి కాబట్టి బీజేపీ అలా ప్లాన్ చేసింది. మరి ఈసారి ఎన్నికల సంగతేంటి? మోడీ ఈసారి మరో టెంపుల్ టౌన్ నుంచి బరిలోకి దిగుతారని అది పూరీ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే విశ్వ సనీయ సమాచారం ప్రకారం మోడీ వారణాసి నుంచే బరిలోకి దిగుతారని తెలుస్తోంది. అయితే మోడీ రెండో నియోజక వర్గం గా పూరీని ఎంచుకుంటారన్నది మరో టాక్.

2014లో గుజరాత్ లోని వడోదరను తన మొదటి ఛాయిస్ గా మోడీ ఎంచుకున్నారు అయితే వారణాసిలో ఉన్న సెంటిమెంట్ కారణంగా వడోదరకు ఆయన గుడ్ బై చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ మోడీకి ప్రత్యర్ధులు. సెంటిమెంట్ పరంగా పూరీని రెండో ఛాయిస్ గా ఎంచుకోవాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూరీ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం పొరుగున ఉన్న బెంగాల్, ఒడిషా, ఏపీలపై కూడా పడుతుందని బీజేపీ అభ్యర్ధుల గెలుపు అవకాశాలు మెరుగుపడతాయనీ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. యూపీ ఉప ఎన్నికలు, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చేతిలో పరాభవం పాలైన నేపధ్యంలో అక్కడికన్నా ఒడిషా, బెంగాల్, లాంటి రాష్ట్రాల్లో విజయావకాశాలు బాగుంటాయని కమల నాథులు అంచనా వేస్తున్నారు. మోడీని పూరీనుంచి బరిలోకి దింపితే ఆ వేవ్ లో తాము కూడా పార్లమెంటుకు ఎంపిక కావచ్చని సంబీత్ మహాపాత్ర లాంటి నేతలు భావిస్తున్నారు. మోడీ రెండు నియోజక వర్గాల్లో ఒకటైన వారణాసి నుంచి పోటీ తధ్యమని తేలుతోంది. రెండోదిగా పూరీ స్థానాన్ని ఎంపిక చేస్తారా లేదా అన్నది తేలాలి వారణాసికి మే19న చివరి దశ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 23న వస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories