ఆలస్యమైనా ఒంటేరు మంచి నిర్ణయం..: కేటీఆర్

ఆలస్యమైనా ఒంటేరు మంచి నిర్ణయం..: కేటీఆర్
x
Highlights

తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌ లోకి వలసలు ఊపందుకున్నాయి. గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీచేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌ లోకి వలసలు ఊపందుకున్నాయి. గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీచేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన అనుచరులతో కలిసి ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకే తాను టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా చేరుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. వంటేరు ప్రతాప్ రెడ్డిని తాను 2009 లోనే టీఆర్‌ఎస్ పార్టీలో చేరమని ఆహ్వానించానని కేటీఆర్ అన్నారు. పదేళ్లు సమయం పట్టినా వంటేరు సరైన నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజక వర్గానికి నిధులు వరద పారుతోందని గజ్వేల్ ప్రజలు అదృష్టవంతులని కేటీఆర్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories