పేగుబంధం కాదనుకుంది.. ప్రేమబంధం అండగా నిలిచింది..

పేగుబంధం కాదనుకుంది.. ప్రేమబంధం అండగా నిలిచింది..
x
Highlights

కన్నవారు కానివారైనా ప్రేమించినవాడు అండగా నిలిచాడు. పేగుబంధం కాదనుకున్నా ప్రేమబంధం కొత్త జీవితాన్ని పేనవేసుకుంది. చావుతో పోరాడిన ఆమెకు ప్రేమ...

కన్నవారు కానివారైనా ప్రేమించినవాడు అండగా నిలిచాడు. పేగుబంధం కాదనుకున్నా ప్రేమబంధం కొత్త జీవితాన్ని పేనవేసుకుంది. చావుతో పోరాడిన ఆమెకు ప్రేమ ఊపిరిలూదింది. ప్రేమ యుద్ధంలో వారు గెలిచారు నిలిచారు. వాలెంటైన్స్ డే సందర్బంగా స్పెషల్ స్టోరీ.

ఐదేళ్ల ప్రేమించుకున్న ఆ ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. కన్నవారు కాదనుకున్నా.. మెట్టినింటి వారు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. కన్నతండ్రి కడతేర్చాలని చూసినా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కాపాడుకున్నాడు. కన్నవారి ప్రేమ కరువైన ఆమెకు అత్తే అమ్మయ్యింది. చావు చివరిదాక వెళ్లినా ప్రేమే ఆమెను బతికించింది. మొదట కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు, వీరి ప్రేమ ప్రయాణం సాఫీగా సాగిపోతోంది.

గత ఏడాది హైదరాబాద్ ఎర్రగడ్డలో కన్న కుతూరుపై తండ్రి కత్తితో కిరాతకంగా దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సందీప్ అండతో కోలుకుంటోంది. పేగుబంధం కాదనుకున్నా ప్రేమబంధం కొత్త జీవితాన్ని ఇచ్చింది. భవిష్యత్తుపై భరోసాను ఇచ్చింది. తనకు అత్త, భర్త అన్ని విషయాల్లోనూ అండగా నిలుస్తున్నారని మాధవి తెలిపింది. తాను పూర్తిగా కోలుకున్నాక స్టడీస్ కంటిన్యూ చేసి, ఉద్యోగం సంపాదించి సందీప్ కు ఆర్థికంగా అండగా నిలుస్తానంటోంది.

మాధవి ఉన్నత చదువులకు తన సహాకారం ఎప్పుడు ఉంటుందని చెప్పాడు సందీప్. తనకు జీవితంలో ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలన్నదే తన కోరిక అని ఎన్ని సమస్యలు ఎదురైనా తాను మాధవి చెయ్యి వదలనని తెలిపారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాడి సాదిస్తామని కష్టమైనా, నష్టమైనా సుఖ దు:ఖాలను కలసి పంచుకుంటామని ధైర్యంగా చెబుతున్నారు మాధవి, సందీప్. ప్రేమ పె‌ళ్లి చేసకోవాలనుకునే జంటలు కాస్తా ఆలస్యమైనా సరే, తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని వీరి సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories