సర్పంచ్ ఎన్నికల బరిలో 90 ఏళ్ల బామ్మ..

సర్పంచ్ ఎన్నికల బరిలో 90 ఏళ్ల  బామ్మ..
x
Highlights

ప్రజాసేవకు వయస్సు అడ్డం కాదు అంటున్నారు కొందరు. ఖమ్మం జిల్లాలో 90 ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్ పదవికి పోటీ చేస్తుండగా, మహబూబాబాద్ జిల్లాలో 22 ఏళ్ల యువతి ఏకగ్రీవంగా ఎన్నికైంది. గ్రామాభివృద్ధే తమ ధ్యేయం అంటున్నారు.

ప్రజాసేవకు వయస్సు అడ్డం కాదు అంటున్నారు కొందరు. ఖమ్మం జిల్లాలో 90 ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్ పదవికి పోటీ చేస్తుండగా, మహబూబాబాద్ జిల్లాలో 22 ఏళ్ల యువతి ఏకగ్రీవంగా ఎన్నికైంది. గ్రామాభివృద్ధే తమ ధ్యేయం అంటున్నారు. ఈ వృద్ధురాలి పేరు ఈడా రత్తమ్మ. ఖమ్మం జిల్లా‌ పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామవాసి. 90 ఏళ్ల వయస్సులో రత్తమ్మ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న రత్తమ్మ భర్త చెన్నయ్య తుమ్మలపల్లికి రెండు పర్యాయలు సర్పంచ్ గా పని చేశారు. భర్త స్ఫూర్తితో సర్పంచ్ పదవికి మూడు సార్లు పోటీ చేసి ఒకసారి ఓడిపోయారు రత్తమ్మ. ఒకసారి జెడ్ పీ టీసీగా పని చేశారు.

నాలుగో సారి పంచాయతీ ఎన్నికల బరిలో దిగారు రత్తమ్మ. వృద్ధాప్యపంలో పోటీకి కారణం. తుమ్మలపల్లి వెనుకబాటుతనమే కారణమంటున్నారు. గ్రామాభివృద్ధే తన తన లక్ష్యమంటున్నారు. మరోవైపు మహబుబాబాద్ జిల్లా మరిపెడ్డ మండలం బాల్య తండా గ్రామ పంచాయతీకి 22 ఏళ్ల స్వాతి సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని సీవీఆర్ కాలేజీలో ఆమె బి.టెక్ పూర్తి చేశారు. గ్రామంలో కనీస వసతులు కల్పిస్తామంటున్నారు. అటు 90 ఏళ్ల రత్తమ్మ, ఇటు 22 ఏళ్ల స్వాతి ప్రజాసేవే తమ ధ్యేయం అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories