టీ కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు...ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు

టీ కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు...ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
x
Highlights

పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలకు టీకాంగ్రెస్ సిద్ధమైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది....

పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలకు టీకాంగ్రెస్ సిద్ధమైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంగా ఆరుగురు నేతలపై బహిష్కరణ వేటు వేసింది.

టీఆర్ఎస్ లో ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు చేరడంతో కాంగ్రెస్ తీవ్ర ఆందోళన చెందుతోంది. మరింత మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేందుకు రెడీ అవుతుండడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల్లో భాగంగా ముందుగా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేయనుంది. నేరుగా ఎమ్మెల్యేల ఇళ్లకు షోకాజ్ నోటీసులు పంపించనుంది. మరోవైపు పార్టీ అదేశాలను ఉల్లంఘించినందుకు ఆరేపల్లి మోహన్‌, రమ్యారావు, మన్నె కృష్ణ, సోయం బాపూరావు, నరేశ్‌ జాదవ్‌, పట్లోల్ల కార్తీక్‌ రెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. తాజా చర్యల ద్వారా పార్టీ నుంచి వలసలకు బ్రేక్ పడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన శివకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories