పార్లమెంట్ ఎన్నికల వరకు ఉత్తమ్ పదవిలో కొనసాగుతారా..?

పార్లమెంట్ ఎన్నికల వరకు ఉత్తమ్ పదవిలో కొనసాగుతారా..?
x
Highlights

నిన్న మొన్నటివరకు ఆయన ఎంత చెబితే అంత నడిచింది. కానీ ఇప్పుడు ఆయన మాట అక్కడ చెల్లుబాటు కావడం లేదా..? అధిష్టానానికి ఆయనపై నమ్మకం తగ్గిందా .!

నిన్న మొన్నటివరకు ఆయన ఎంత చెబితే అంత నడిచింది. కానీ ఇప్పుడు ఆయన మాట అక్కడ చెల్లుబాటు కావడం లేదా..? అధిష్టానానికి ఆయనపై నమ్మకం తగ్గిందా .! అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిస్థితులు చూస్తేంటే ఇంతకి ఎవరా నేత హై కమాండ్ దగ్గర ఎందుకు నమ్మకం కోల్పోయారు.?

తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి పట్టు సంపాదించారు. అధిష్టానం కూడా ఉత్తమ్ ఎంత చెబితే అంతగా ప్రియార్టీ ఇస్తూ వచ్చింది. నాలుగేళ్లుగా అనేక సార్లు పీసీసీ పదవి నుంచి ఉత్తమ్ ను తప్పిస్తారంటూ పదే పదే వార్తలు వచ్చాయి. ఎంతో మంది ఉత్తమ్ పై హైకమాండ్ కు కంప్లైంట్ చేశారు. అయినా ఎలాంటి ముప్పు రాలేదు. ఉత్తమ్ కూడా తనను తొలగించరు అనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గమనిస్తే సీన్ రివర్స్ అయినట్లు సొంత పార్టీలోనే చర్చ కొనసాగుతోంది.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. ఉత్తమ్ సీఎం అవుతారనే చర్చ జోరుగా నడిచింది. తీరా చూస్తే పార్టీ మరోసారి ఘోర ఓటమిని చవిచూసింది. ఇక సిఎల్పీ పదవిపై పార్టీ నేతల మద్య చర్చ నడిచింది. ఐతే పీసీసీ పదవిలో ఉంటూనే ఉత్తమ్ సిఎల్పీ కావాలని హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేశారన్న గుసగుసలు వినిపించాయి. సిఎల్పీ నేతగా ఉత్తమ్ నే నియమిస్తుందని ఆయన అనుచరులు చెప్పుకొచ్చారు. కానీ ఫైనల్ గా అధిష్టానం మాత్రం ఉత్తమ్ ని కాదని మల్లు భట్టి విక్రమార్కకు సిఎల్పీ పదవిని కట్టబెట్టింది.

హైకమాండ్ వద్ద ఉత్తమ్ మాట చెల్లడంలేదని పార్టీ నేతలు లోలోలప చర్చించుకుంటుండగా.. మరికొందరు నేరుగానే ఉత్తమ్ పై అధిష్టానం వద్ద నమ్మకం సన్నగిల్లిందంటూ విమర్శలు ఎక్కు పెట్టారు. పీసీసీ పదవి నుంచు కూడా త్వరలోనే తొలగిస్తారంటూ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. పార్లమెంట్ ఎన్నికల వరకు ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా కొనసాగుతారా, ఇలోగా అధిష్టానం కొత్త వారిని నియమిస్తుందా అన్నది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories