బోర్డులో లుకలుకలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుంది?

బోర్డులో లుకలుకలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుంది?
x
Highlights

ఇంటర్ ఫలితాల గందరగోళంపై ఇటు ప్రభుత్వం, అటు బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని బోర్డు కార్యదర్శి అశోక్...

ఇంటర్ ఫలితాల గందరగోళంపై ఇటు ప్రభుత్వం, అటు బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని బోర్డు కార్యదర్శి అశోక్ అన్నారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇంటర్ బోర్డు వ్యవహారాలపై నిఘా సంస్థ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. విద్యార్థుల నిరసనలు, ఆందోళనకు ఇంటర్ బోర్డు దిగి వచ్చింది. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు జరిగినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ అంగీకరించారు. ఎగ్జామినర్ చేసిన పొరపాటు వల్ల సమస్య ఏర్పడిందన్నారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

21వేల జవాబు పత్రాలు గల్లంతయ్యాయన్న వార్తుల అవాస్తవమన్నారు అశోక్. జవాబు పత్రాలు పోలీసు కస్టడీలో భద్రంగా ఉన్నాయని చెప్పారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్, రీ వాల్యువేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్, రీ వాల్యువేషన్ గడువు తేదీల పొడిగింపుపై ఆలోచిస్తామని అశోక్ భరోసా ఇచ్చారు. మరోవైపు ఇంటర్ ఫలితాలు, విద్యార్థుల గందరగోళంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇంటర్ బోర్డుపై వస్తున్న ఆరోపణలపై వాటి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. నిఘా వర్గాల నుండి రిపోర్టు తెప్పించుకుంది ప్రభుత్వం. ఇంటర్ బోర్డు, ఉద్యోగుల మధ్య ఆదిపత్య పోరు కారణంగానే ఇంటర్ ఫలితాలపై గందరగోళం ఏర్పడిందని నివేదిక సమర్పించింది.

ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలు నిజానిజాలు తేల్చేందుకు కమిటీ వేసింది ప్రభుత్వం. బోర్డులో జరిగిన వ్యవహారాలపై కమిటీ ప్రాథమిక రిపోర్టు ఇచ్చింది. బోర్డు సెక్రటరీ అశోక్ , ప్రభుత్వ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదమే ఈ సమస్యకు కారణమని సోషల్ మీడియా బోర్డుపై అసత్య ప్రచారం చేసింది మధుసూదన్ రెడ్డేనని కమిటీ రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం. గ్లోబరినా సంస్థకు ఎటువంటి అర్హతలు లేకున్నా కాంట్రాక్టు ఇచ్చారని బోర్డులో కొందరు ఆ సంస్థకు సహకరించారని మధుసూదన్ రెడ్డి అంటున్నారు. ఇంటర్ రిజల్ట్ గందరగోళం, బోర్డులో లుకలుకలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసకుంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories