కోడి రామకృష్ణ నుదుటిపై ఆ బ్యాండ్ ఎలా వచ్చిందంటే?

కోడి రామకృష్ణ నుదుటిపై ఆ బ్యాండ్ ఎలా వచ్చిందంటే?
x
Highlights

ఊపిరితిత్తుల వ్యాధితో ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనను చూడగానే నవ్వుతో కూడిన ముఖం, నుదిటిపై బ్యాండ్...

ఊపిరితిత్తుల వ్యాధితో ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనను చూడగానే నవ్వుతో కూడిన ముఖం, నుదిటిపై బ్యాండ్ కనిపిస్తాయి ఆయనకు సెంటిమెంట్లు ఎక్కువ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వీటికి సంబంధించి వివరణ ఇచ్చారు. దాస‌రి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కొన్నాళ్లు ప‌ని చేసిన కోడి రామ‌కృష్ణ త‌న తొలి చిత్రంగా ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య చేశారు. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. దీంతో రెండో చిత్రానికి పెద్ద‌గా గ్యాప్ తీసుకోలేదు.

కోవ‌లం బీచ్ ద‌గ్గ‌ర త‌న రెండో సినిమా చిత్ర షూటింగ్ జ‌రుపుతున్నారు కోడి రామ‌కృష్ణ‌. ఆ స‌మ‌యంలో అక్క‌డికి ఎన్టీ రామారావు కాస్ట్యూమర్‌ మోకా రామారావు వ‌చ్చార‌ట‌. మిట్ట మ‌ధ్యాహ్నం మండుటెండ‌లో సినిమా చేస్తున్న కోడిని చూసిన ఆయ‌న మీ నుదురు ఎండ‌కి కాలిపోతుంది అని త‌న‌ జేబులో ఉన్న రుమాలు ఇచ్చార‌ట‌.ఆ రోజంతా ఆ రుమాలుని అలానే ఉంచుకున్న కోడి రామ‌కృష్ణ త‌ర్వాతి రోజున బ్యాండ్‌లా త‌యారు చేసి క‌ట్టుకున్నార‌ట‌. ఇది మీకు బాగా సూట్ అయింది. దీనిని క‌ట్టుకోకుండా ఉండొద్దు అని మోకా రామారావు చెప్పార‌ట‌. ఇక అప్ప‌టి నుండి ఆయ‌న‌కి ఈ త‌ల బ్యాండ్ సెంటిమెంట్‌గాను మారింది. దీంతో ఆయ‌న‌కి ప్ర‌త్యేక గుర్తింపు కూడా వ‌చ్చింది. పోలీసులకు టోపి, రైతుకు తలపాగా ఎలాగో నాకు ఈ బ్యాండ్‌ అలా అన్నమాట. దీన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాను అని ప‌లుమార్లు కోడి రామ‌కృష్ణ ఇంట‌ర్వ్యూల‌లో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories