రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నా- బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి

రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నా- బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి
x
Highlights

రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. తన భార్య శైలజ అనారోగ్య పరిస్థితుల వల్లే తాను ఈ నిర్ణయం...

రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. తన భార్య శైలజ అనారోగ్య పరిస్థితుల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. తనకు ఇంతటి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, నియోజకవర్గ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నానని, అందరూ తనను క్షమించాలని కోరారు. అయితే బుడ్డా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పడంతో ఆయన కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. జై బుడ్డా అంటూ నినాదాలు చేశారు. ఓ అభిమాని ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories