బాంబు పేలుళ్లతో రక‍్తమోడుతున్న కొలంబో.. ఈ విషాద ఘటన ఎలా జరిగింది ?

బాంబు పేలుళ్లతో రక‍్తమోడుతున్న కొలంబో.. ఈ విషాద ఘటన ఎలా జరిగింది ?
x
Highlights

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మందికి పైగా ప్రాణాలు గాల్లో కలిశాయి. వందల సంఖ్యలో క్షతగాత్రులు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఇంత పెద్ద...

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మందికి పైగా ప్రాణాలు గాల్లో కలిశాయి. వందల సంఖ్యలో క్షతగాత్రులు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఇంత పెద్ద విషాద ఘటన ఎలా జరిగింది ? సూసైడ్‌ బాంబర్లే పేలుళ్లకు కారణమని చెబుతున్నారు. మరి ఆత్మాహుతిదళ సభ్యులు ఎక్కడ, ఎప్పుడు పేల్చుకున్నారు ? ఈస్టర్‌ డే సందర్భంగా విదేశీయులే లక్ష్యంగా జరిగినే పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింంది. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ చరిత్రలోనే మరో విషాద ఘటనగా పేర్కొంటున్నారు. అయితే ఈ పేలుళ్లపై విచారణ ప్రారంభించిన దర్యాప్తు సంస్థలు కీలక సమాచారం రాబట్టారు. సూసైడ్‌ బాంబర్లే ఈ పేలుళ్లకు కారణమని తేల్చారు.

అయితే పేలుళ్లపై విచారణ జరుపుతున్న పోలీసులకు.. సీసీ టీవీ ఫూటేజే కీలక ఆధారంగా మారింది. దీని ఆధారంగానే నిందితులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. షాంగ్రీలా హోటల్‌ లోని సీసీ టీవీ కెమెరాల ద్వారా నిందితులను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. పేలుళ్లలో ఇద్దరు సూసైడ్‌ బాంబర్లు పాల్గొన్నారని ప్రాథమికంగా నిర్ధారించారు.శనివారం కొలంబోలోని షాంగ్రీలా హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు దిగారు. 616 నెంబరు గల రూమ్‌ను బుక్‌ చేసుకున్నారు. ఈ ఇద్దరే సూసైడ్‌ బాంబర్లుగా మారి తమను తాము పేల్చుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ షాంగ్రిలా హోట‌ల్‌లోని కెఫెటేరియా, కారిడ‌ర్ దగ్గర త‌మ‌ను తాము పేల్చుకున్నారు. పేలుళ్ల కోసం వీరు సీ-4 ఎక్స్‌ప్లోజివ్స్‌ను వాడిన‌ట్లు తెలుస్తోంది. అయితే షాంగ్రీలా హోట‌ల్‌ను పూర్తిగా పేల్చేందుకు.. అత్మాహుతి దళం ముందుగా ప్రయత్నించింది. ఇందుకోసం సుమారు 25 కిలోల బాంబులను వినియోగించినట్లు తెలుస్తోంది.

పేలుళ్ల తర్వాత హోటల్‌ రూమ్‌లోకి ప్రవేశించిన పోలీసులు వారు ఉపయోగించిన కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ సూసైడ్ బాంబ‌ర్లు ఇస్లామిక్ తీవ్రవాదులని విచార‌ణాధికారులు అంచ‌నా వేస్తున్నారు. కానీ ఈ పేలుళ్ల వెనుక ఇంకా ఏయే శక్తులున్నాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు చర్చీల్లో పేలుళ్ల వెనుక ఉన్న వారెవరనేదానిపై కూడా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అయితే పేలుళ్లకు పాల్పడింది ఇతర దేశాల నుంచి వచ్చారా..? లేక స్థానికులా..? అన్న దానిపై పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories