శ్రీలంకలో కర్ఫ్యూ ..ఇంటర్నెట్ సేవలు బంద్..

శ్రీలంకలో కర్ఫ్యూ ..ఇంటర్నెట్ సేవలు బంద్..
x
Highlights

వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కొలంబోలో కర్ఫ్యూ విధించారు. శ్రీలంక ప్రధాని రనిల్...

వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కొలంబోలో కర్ఫ్యూ విధించారు. శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ సింఘే జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకూ కర్ఫ్యూ విధించింది. సోషల్‌ మీడియాపై కూడా లంక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇంటర్‌నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. పాఠశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించింది. వివిధ దేశాల రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

దేశవ్యాప్తంగా భద్రతాల దళాలు విస్తృత సోదాలు జరుపుతున్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేష్లన్లు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పేలుడు జరిగిన ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ జులాజికల్‌ గార్డెన్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల వెనుక అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐసిస్ హస్తమున్నట్లు శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది. ఐసిస్‌కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యులే ఈ ఘటనకు కారణమని శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఐసిస్ సభ్యులే ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు ధ్రువీకరించినట్లు ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

మారణకాండపై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ, పునరావాస చర్యలు ముమ్మరంగా చేపట్టేందుకు పలు చోట్ల సైన్యాన్ని రంగం దించాలని ఆదేశించారు. భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేసి తక్షణమే విధుల్లోకి చేరాలని అధికారులను ఆదేశించారు. కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనతో శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ సింఘే తన నివాసంలో జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉగ్రదాడిని ప్రధాని తీవ్రంగా ఖండించారు. వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన ఉపఖండంలో ఇలాంటి ఆటవిక దాడులకు స్థానం లేదన్నారు. కష్టకాలంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories