రాహుల్‌ గాంధీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

రాహుల్‌ గాంధీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
x
Highlights

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు పరాకాష్టకు చేరుతున్నాయి. మంగళవారం ముడో విడత ఎన్నికలు జరుగనుండగా నేతల వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం...

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు పరాకాష్టకు చేరుతున్నాయి. మంగళవారం ముడో విడత ఎన్నికలు జరుగనుండగా నేతల వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ నేత మహారాష్ట్ర మంత్రి, పంకజ ముండే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపించారు. జాల్నా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ప్రచార సభలో పంకజ ముండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నుంచి దేశం నుంచి కేంద్రసర్కార్ రక్షిస్తుంటే రాహుల్ మాత్రం సర్జికల్ దాడులపై ఆధారాలు కావాలని అడుగుతున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ మెడకు బాంబు చుట్టి దేశం అవతలకు పరేయాలని అన్నారు. బాలాకోట్ వాయిదాడులపై కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు స్పందనగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటే వాళ్లు (కాంగ్రెస్) ప్రశ్నిస్తున్నారని, మన సైనికులపై దాడి చేసినప్పుడు సర్జికల్ దాడులతో తిప్పికొట్టామని అన్నారు. ఇదిలా ఉంటే పంకజ ముండే చేసిన వ్యాఖ్యాలకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. హేమంత్ కర్కరే వంటి అమర వీరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి ఇలాంటి మాటలే వస్తాయని అన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు కొత్త ఏమీ కాదని కాంగ్రెస్ నేతలు విమర్శిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories