పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రజెండా మద్దతు కోరిన టీ-కాంగ్రెస్..

పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రజెండా మద్దతు కోరిన టీ-కాంగ్రెస్..
x
Highlights

పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా తెలంగాణ సీపీఐ ని కాంగ్రెస్ కోరింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తో తెలంగాణ కాంగ్రెస్...

పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా తెలంగాణ సీపీఐ ని కాంగ్రెస్ కోరింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దీనికి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీపీఐ నేతలు హామీ ఇచ్చినట్టు రేవంత్ చెప్పారు. సీపీఐ మద్దతుతో కేసీఆర్ అరాచకంపై పోరాడతామని, అరాచకానికి కేసీఆర్, మోదీ బొమ్మా బొరుసు లాంటివారని, కేసీఆర్ కేంద్రం నుంచి నయాపైసా రాలేదంటున్నారని, అలాంటప్పుడు నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్ ఎందుకు మద్దతిచ్చింది? అని ప్రశ్నించారు. అక్కడ మోదీని, ఇక్కడ కేడీని నిలువరించాలంటూ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు 'కిక్' ఇస్తున్నాయని, టీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. మోదీని నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ గచ్చిబౌలీ దివాకర్ లాంటోడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories