పార్టీలో అన్యాయం జరిగింది.. అయినా...

పార్టీలో అన్యాయం జరిగింది.. అయినా...
x
Highlights

పార్టీలో తనకు అన్యాయం జరిగిందని అయినా కాంగ్రెస్‌ను వీడేది లేదని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రేణుకా చౌదరి అసెంబ్లీ...

పార్టీలో తనకు అన్యాయం జరిగిందని అయినా కాంగ్రెస్‌ను వీడేది లేదని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రేణుకా చౌదరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత వహించారని ప్రశ్నించారు. ఇప్పుడు ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకోండి అంటున్నారని ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఎవరు బాధ్యత తీసుకుంటారని అన్నారు. ఖమ్మం జిల్లాలో పనికి రాని వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తారా అని ప్రశ్నించారు. అనామకులకు బాధ్యతలు అప్పగిస్తే, పార్టీ నాశనం కాదా అన్నారు. ఎన్నికల్లో సహకరించలేదని తనపై ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని రేణుకా చౌదరి తెలిపారు. తాను తలుచుకుంటే, వాళ్లు గెలిచే వాళ్లా అని కార్యకర్తల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దీక్షకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి, జిల్లాలో కొందరు నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదవులు వచ్చినంత మాత్రాన కిరీటాలు రావని ఆరోపించారు. పార్టీలో అన్యాయం జరుగుతుందని కొందరు కార్యకర్తలు ఆవేదనలో ఉన్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా జిల్లాకు రాలేక పోయానని రేణుకా చౌదరి చెప్పారు. ఖమ్మంలో గెలుపు తమ వల్లేనని కొందరు నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ, ఆ క్రెడిడ్ అంతా కార్యకర్తలదేనని రేణుకా స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories