సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్క

సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్క
x
Highlights

తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. గత మూడ్రోజులుగా సీఎల్పీ నేతగా ఎవర్ని ప్రకటించాలనే విషయంపై అధిష్టానం కాంగ్రెస్ నేతలు చర్చించారు.

తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. గత మూడ్రోజులుగా సీఎల్పీ నేతగా ఎవర్ని ప్రకటించాలనే విషయంపై అధిష్టానం కాంగ్రెస్ నేతలు చర్చించారు. సీఎల్పీ రేసులో మొదట్నించి భట్టీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు వినిపించాయి. అధిష్టానం దూతగా వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. అధిష్టానాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసి అధిష్టానానికి సమర్పించారు. మల్లు భట్టి విక్రమార్క పేరును ఫైనల్ చేశారు రాహుల్ గాంధీ.

భట్టి విక్రమార్క గతంలో డిప్యూటీ స్పీకర్ గా ప్రభుత్వ చీప్ విప్ గా పని చేశారు. అసెంబ్లీ వ్యవహారాలన్ని తెలిసిన వ్యక్తిగా అధిష్టానం గుర్తించింది. సామాజిక సమీకరణాల అంశాన్ని పరిగణలోకి తీసుకుని భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా ఎంపిక చేశారు. కొద్ది సేపటి క్రితమే భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ నుంచి లేఖ విడుదల చేశారు. భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీలోనూ ఎమ్మెల్యేగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేసిన భట్టి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార సారధిగా బాద్యతలు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories