ఉగ్ర దాడిలో అమరులైన ఒక్కో జవాన్ కుటుంబానిది ఒక్కో గాథ...పెను విషాదంలోనూ...

ఉగ్ర దాడిలో అమరులైన ఒక్కో జవాన్ కుటుంబానిది ఒక్కో గాథ...పెను విషాదంలోనూ...
x
Highlights

కశ్మీర్ ఉగ్ర దాడిలో అమరులైన ఒక్కో జవాన్ కుటుంబానిది ఒక్కో గాథ. కొడుకును కోల్పోయిన తల్లి తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు భర్తను త్యాగం చేసిన భార్య ఇలా...

కశ్మీర్ ఉగ్ర దాడిలో అమరులైన ఒక్కో జవాన్ కుటుంబానిది ఒక్కో గాథ. కొడుకును కోల్పోయిన తల్లి తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు భర్తను త్యాగం చేసిన భార్య ఇలా ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి సంద్రమే కనిపిస్తోంది. తమ ఆధారాన్ని, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి తల్లడిల్లిపోతున్నాయి. అయితే అంతటి పెను విషాదంలోనూ దేశ భక్తిని చాటుతున్నారు. అవకాశం వస్తే మాతృభూమి కోసం ఎంతమందినైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తున్నారు.

మధ్యప్రదేశ్ కుదవాల్ సిహోరా గ్రామానికి చెందిన 36ఏళ్ల అశ్విన్ కశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అశ్విన్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే అశ్విన్ కుటుంబానికి గ్రామం మొత్తం అండగా నిలిచింది. తమ గ్రామస్తుడు దేశం కోసం అమరుడైనందుకు ఎంతగానో గర్విస్తున్నామని, అవకాశం వస్తే తమ కొడుకులందరినీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించి దేశభక్తిని చాటుకున్నారు.

ఇక పశ్చిమబెంగాల్ హౌరాకి చెందిన అమర జవాన్ బబ్లూ సంత్రాది మరో కన్నీటి గాథ. హోలీకి ఇంటికి వస్తానని చెప్పిన కొడుకు బబ్లూ గొంతు విన్న తల్లి కొద్ది గంటల్లోనే అతని మరణవార్త వినాల్సి వచ్చింది. ఉగ్ర దాడి జరిగిన గురువారం రోజే ఇంటికి ఫోన్ చేసిన బబ్లూ కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. హోలీ పండక్కి ఇంటికి వస్తానని సంతోషంగా చెప్పాడు. కానీ విధి మరోలా ఉంది. మానవ బాంబు రూపంలో మృత్యువు కబలించింది. బబ్లూ మృతితో అతని భార్య మితా కన్నీరుమున్నీరవుతోంది.

ఒడిషాకి చెందిన అమర జవాన్ ప్రసన్నకుమార్ సాహూ కుటుంబానికి గాథా ఇలాంటిదే. రెండు నెలల సెలవులను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి వెళ్లిన తండ్రి ఇక రాడని తెలిసి కొడుకూ కూతురు తల్లడిల్లిపోతున్నారు. ప్రసన్న కుమార్ మృతిని తట్టుకోలేకపోతున్న ప్రసన్నకుమార్ పిల్లలు అదే సమయంలో తమ నాన్న దేశం కోసం అమరుడైనందుకు గర్వంగా ఉందంటున్నారు.

ఉగ్ర దాడిలో ప్రాణాలొదిలిన మరో ఒడిషా వాసి మనోజ్ బెహరా కుటుంబం బాధ వర్ణనాతీతంగా ఉంది. రెండు నెలల క్రితం ఇంటికి వచ్చిన మనోజ్ బెహరా వృద్ధ తల్లిదండ్రులతో ఆనందంగా గడిపాడు. కూతురు ఫస్ట్ బర్త్ డే వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తిరిగి బలగాల్లో చేరిన మనోజ్ కూతురు బాగోగులు తెలుసుకోవడానికి భార్యకు ఫోన్ చేశాడు. శ్రీనగర్ వెళ్తున్నామని వెళ్లగానే మళ్లీ ఫోన్ చేస్తానన్నాడు. కానీ కొద్దిగంటల్లోనే ఉగ్ర దాడికి బలైపోయాడు.

పంజాబ్ లోని గలోటి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన సబ్ ఇన్ స్పెక్టర్ జైమల్ సింగ్ కశ్మీర్ ఉగ్రదాడిలో వీర మరణం పొందడంతో కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు కూడా జీర్జించుకోలేకపోతున్నారు. జైమల్ భార్యతోపాటు అతని వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ ఆధారాన్ని, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి తల్లడిల్లిపోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories