బుసలు కొడుతున్న కట్టల పాములు

బుసలు కొడుతున్న కట్టల పాములు
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతుండగానే మరో వైపు నగదు తరలింపు ఊపందుకుంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి కోట్లాది రూపాయలు...

తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతుండగానే మరో వైపు నగదు తరలింపు ఊపందుకుంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి కోట్లాది రూపాయలు రెండు రాష్ట్రాలకు నియోజకవర్గాలకు తరలివెళుతున్నాయి. సిటీ పోలీసుల కళ్లు గప్పి కోట్లాది రూపాయలు నేతల చెంతకు చేరుతున్నాయి. మరోవైపు నగరంలోకి ప్రవేశించిన హవాలా గ్యాంగ్‌లు మూడో కంటికి తెలియకుండా పనులు చక్కపెడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. గత మూడు రోజుల్లో పట్టుబడిన నగదు అధిక శాతం హవాలా డబ్బు కావడంతో పోలీసుల సందేహాలు నిజమవుతున్నాయి.

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రత్యేక బృందాలు, పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా హవాలా సొమ్మును తరలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా నగరంలో పోలీసులు చేసిన తనిఖీల్లో మొత్తం 14 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో అయా రాజకీయ పార్టీలకు సంబంధించిన వారితో పాటు బడా వ్యాపారులు సైతం ఉన్నారు. రాజకీయ అవసరాల కోసం ఓటర్లను మభ్యపెట్టేలా ఈ డబ్బును హావాలా రూపంలో తరలిస్తున్నట్లు పోలిసులు విచారణలో తెలుస్తోంది.

పోలీసులుకి వచ్చిన పక్క సమాచారం తో బంజారాహీల్స్, మలక్ పేట్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ గోల్కొండ ఎస్.ఆర్.నగర్ జూబ్లీహిల్స్ టప్పాచబుత్ర లో ఫ్లైయింగ్ స్క్వాడ్ సంయుక్తంగా తనిఖీలు జరపగా నగరానికి చెందిన నలుగురు పోలీసులకు చిక్కారు. వేరు వేరు ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో మొత్తం నలుగురుని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి 4కోట్ల92లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

బంజారాహీల్స్, పాతబస్తీ లోని హుస్సేనీ అలం, మలక్ పేట్, నార్త్ జోన్ సౌజన్య వెస్ట్ జోన్ ఈస్ట్ జోన్ తదితర ప్రాంతాల్లో హావాలా రూపంలో అదిక మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు పోలిసులకు సమాచారం అందడంతో స్పెషల్ బ్రందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఇందులో బాగంగా మలక్ పేట్ లో 34,30 వేల రూపాయలు స్వాదీనం చేసుకున్నారు. కాశీనాద్ రెడ్డి, బుక్యారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను విచారించారు. హవాలా డబ్బును తరలిస్తున్న స్వీఫ్ట్ కారును స్వాదీనం చేసుకున్నారు.

మరోవైపు నల్గొండ మల్కాజ్గిరి లోక్ సభ స్థానాలకు చెందిన ఆయా పార్టీలకు చెందిన ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన డబ్బు ఈ తనిఖీల్లో పట్టుబడిన విశేషం. పట్టుబడిన డబ్బు బూత్ లెవల్ లో పనిచేసే వారికి అందజేసేందుకు అక్రమంగా డబ్బులు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తానికి గడిచిన రెండు రోజుల్లో పోలిసులు పెద్ద మొత్తంలో డబ్బును సీజ్ చేశారు. ఇప్పటివరకు 14కోట్ల నగుదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలిసులు ఇన్ కం టాక్స్ అదికారులకు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories