గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న టీటీడీపీ

గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న టీటీడీపీ
x
Highlights

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. కానీ ఉమ్మడి ఏపీలో దూసుకుపోయిన సైకిల్‌ తెలంగాణ ఏర్పడిన తర్వాత జాడ లేకుండా...

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. కానీ ఉమ్మడి ఏపీలో దూసుకుపోయిన సైకిల్‌ తెలంగాణ ఏర్పడిన తర్వాత జాడ లేకుండా పోయింది. ఉన్న కొద్ది మంది నేతలు కూడా పార్టీ మారుతుండడంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ. దేశమంతా అన్నీ పార్టీల్లో ఎన్నికల ఊపు కనిపిస్తున్నా, టీటీడీపీల మాత్రం ఉలుకు లేకుండా ఉంది. ఉమ్మడి ఏపీలో దూసుకుపోయిన సైకిల్‌ తెలంగాణ ఏర్పడిన తర్వాత కారు స్పీడ్‌కి మరుగున పడింది. ఉన్న కొద్దిమంది నేతలు ఈ ఎన్నికల్లో పార్టీ మారుతుండడంతో టీటీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో టీటీడీపీ 15 సీట్లు గెలిచింది. అయితే గెలిచిన టీడీపీ నేతలంతా కార్‌లోకి జంప్‌ అయ్యారు. దీంతో సైకిల్‌ పార్టీ డల్‌ అయ్యింది. క్రమంగా టీటీడీపీలో ఉన్న ప్రముఖ నేతలు ఇతర పార్టీలకు వలస వెళ్లారు. ఈ ప్రభావం 2018లో జరిగిన అసెంబల్లీ ఎన్నికల్లో కనిపించింది. కాంగ్రెస్‌ పొత్తుతో 13 సీట్లలో పోటీ చేస్తే, కేవలం రెండంటే రెండు సీట్లు గెలిచింది టీటీడీపీ.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీటీడీపీ తరుపున సత్తుపల్లి నుంచి సండ్రా వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి ఎం నాగేశ్వరావు గెలిచారు. అయితే ఇటీవల సండ్రా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఏప్రిల్‌ 11న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావును బరిలోకి దించేందుకు టీటీడీపీ సన్నాహాలు చేసింది. కానీ ఇంతలో నామా కూడా సైకిల్‌ కన్నా, కారే బెస్ట్‌ అనుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. టీటీడీపీ మహిళా గౌరవ అధ్యక్షురాలు శోభారాణి కూడా టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వరుసగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఇతర పార్టీలకు వలస వెళ్లడంతో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories