కౌన్ బనేగా స్పీకర్..?

కౌన్ బనేగా స్పీకర్..?
x
Highlights

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎవరవుతారనేది ఉత్కంఠంగా మారింది. గులాబీ పార్టీ అధినేత మనసులో ఎవరున్నారు. ఎవరిని స్పీకర్ పదవి వరించేను, ఇప్పటి వరకు తెరపైకి వచ్చిన నేతలు ఏమంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎవరవుతారనేది ఉత్కంఠంగా మారింది. గులాబీ పార్టీ అధినేత మనసులో ఎవరున్నారు. ఎవరిని స్పీకర్ పదవి వరించేను, ఇప్పటి వరకు తెరపైకి వచ్చిన నేతలు ఏమంటున్నారు. పార్టీ సీనియర్ నేతల్లో ఒకరిని స్పీకర్ గా ఇప్పటికే గులాబీ బాస్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో స్పీకర్ గా ఎవరిని ప్రతిపాధిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలకు సమయం ఆసన్నం కావడంతో స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. పార్టీలోని సీనియర్ నేతలు స్పీకర్ పదవిపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో సీఎం కేసీఆర్ ఎవరి పేరును ప్రతిపాదిస్తారోనన్నది చర్చనీయాంశంగా మారింది..

ఇప్పటికే చాలా మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. స్పీకర్ పదవిపై వారంతా విముఖత చూపుతున్నారు. పార్టీ సీనియర్ నేతల్లో పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డి, రెడ్యానాయక్, ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి పేర్లు స్పీకర్ పదవికోసం ప్రచారంలో ఉన్నాయి. అయితే వీరంతా పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి తమకు ఆ పదవి వద్దంటూ మొరపెట్టుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

పోచారం తనకు ఆరోగ్యం సహకరించదని కేసీఆర్ కు చెప్పుకున్నట్లు ప్రగతి భవన్ వర్గాలంటున్నాయి. మరో నేత రెడ్యానాయక్ ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డిలు మంత్రి పదవి ఇవ్వాలంటూ అధినేతను అభ్యర్దించారని సమాచారం. కొన్ని దశాబ్దాలుగా స్పీక‌ర్ సీట్లో కూర్చున్న నేత‌లంతా ఆ త‌ర్వాత జరుగుతున్న ఎన్నిక‌ల్లో ఓటమి పాలవుతూ వచ్చారు. సెంటిమెంట్ గా మారటంతో స్పీకర్ పోస్ట్ అంటేనే ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నారు. తమ పేర్లను స్పీకర్ పదవికి సూచించోద్దని చర్చకూడా చేయ్యోద్దంటున్నారు కొందరు నేతలు.

గతంలో దేవాదాయశాఖ మంత్రిగా కొనసాగిన వారూ కూడా ఆ తర్వా ఎన్నికల్లో ఓటమిపాలయ్యేవారు. అయితే దేవాదాయా శాఖ మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి అభ్యర్దిత్వాన్ని కూడా స్పీకర్ పదవికి సీఎం కేసీఆర్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు పద్మాదేవేందర్ రెడ్డి కూడా గత అసెంబ్లీ లో డిప్యూటి స్పీకర్ గా పనిచేసారు ఆమోకున్న అనుభవం దృష్ట్యా ఆమో పేరుకుడా పరిశీలనలో ఉంది.

సీఎం కేసీఆర్ వివిధ అంశాలు పరిగణలోనికి తీసుకొని స్పీక‌ర్ గా ప్ర‌తిపాదించ‌బోతున్నారన్నది ఆసక్తిని కల్గిస్తోంది. ఈ ప‌ద‌వి త‌మ‌కు వ‌ద్ద‌ంటున్న నేత‌లు కేసీఆర్ డిసైడ్ చేశాక త‌ప్ప‌ని స‌రిగా ఆ సీట్లో కూర్చోవ‌ల‌సిందే అని వారే అంటున్నారు. కేసీఆర్‌ మ‌న‌సులో ఈ ప‌ద‌వికి ఎవ‌రిని ఎంపిక చేసుకున్నార‌న్న‌ది టాప్ సీక్రెట్‌ గా ఉంది. స్పీక‌ర్ ప‌ద‌వికి ఎవ‌రైతే సెట్ అవుతారు. స‌భ‌ను స‌జావుగా న‌డిపే స‌త్తా ఎవ‌రికుందనేది సీఎం ఇప్ప‌టికే ఒక అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి సీఎం కేసీఆర్‌ ఎవ‌రిని స్పీక‌ర్ గా ఎవ‌రిని ప్ర‌తిపాదిస్తారన్న‌దే హాట్ టాపిక్ గా మారింది. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎవరిని స్పీకర్ గా సూచిస్తారనేది ఓ క్లారిటి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories