మనోహర్ పారికర్‌ అస్తమయం...నేడు సంతాప దినంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

మనోహర్ పారికర్‌ అస్తమయం...నేడు సంతాప దినంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
x
Highlights

గోవా సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో మనోహర్ పారికర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోమవారం జాతీయ...

గోవా సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో మనోహర్ పారికర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోమవారం జాతీయ సంతాపదినాన్ని పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఈరోజు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు పనాజీలోని బీజేపీ కార్యాలయంలో పారికర్ మృతదేహానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తారు. అనంతరం 10.30 గంటలకు కళా అకాడమీకి తీసుకుని వెళతారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాధారణ ప్రజల సందర్శనార్థం పారికర్ పార్థివదేహాన్ని అక్కడ ఉంచుతారు.

ఇక సాయంత్ర 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో మనోహర్ పారికర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తోపాటు బీజేపీ ముఖ్యనేతలు, పార్టీ కార్యకర్తులు హాజరు కానునట్లు సమాచారం అందుతోంది.

ఇక గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ మృతికి సంతాపంగా సోమవారం జాతీయ సంతాపదినాన్ని పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ జెండాను సగం వరకు అవనతం చేస్తారు. మరోవైపు ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్ర ప్రభుత్వం భేటీ కానుంది. పారికర్ మృతితో బీజేపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories