తొమ్మిదో తరగతి విద్యార్థి వినూత్న ఆవిష్కరణ

తొమ్మిదో తరగతి విద్యార్థి వినూత్న ఆవిష్కరణ
x
Highlights

ఆ అబ్బాయి చదువుతోంది తొమ్మిదో తరగతే కానీ తలపండిన శాస్త్రవేత్తలా ఆలోచించాడు. పండించిన ధాన్యం బస్తాల్లోకి ఎత్తే పరికరాన్ని కనుగొన్నాడు. జాతీయ స్థాయిలో...

ఆ అబ్బాయి చదువుతోంది తొమ్మిదో తరగతే కానీ తలపండిన శాస్త్రవేత్తలా ఆలోచించాడు. పండించిన ధాన్యం బస్తాల్లోకి ఎత్తే పరికరాన్ని కనుగొన్నాడు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన ఈ బాల మేధవిని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా ఆహ్వానించి నగదు పారితోషికం ఇచ్చి అభినందించారు.

అభిషేక్ రాజన్నసిరిసిల్ల జిల్లా హనుమాజీపేట జెడ్పీ హెచ్ఎస్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అభిషేక్ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు. పండించిన ధాన్యాన్ని బస్తాల్లో నింపే యంత్రాన్ని కనిపెట్టాడు. అభిషేక్ తయారు చేసిన అద్భుత ఆవిష్కరణకు రాష్ర్ట స్థాయి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ఫెయిర్‌లో ప్రథమ బహుమతి జాతీయ స్థాయిలో మూడో బహుమతి వచ్చింది.

విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అభిషేక్ ను స్వయంగా ప్రగతిభవన్‌కు ఆహ్వానించారు. ఢిల్లీలో బహుమతి అందుకున్న అభిషేక్ తన ఉపాధ్యాయులతో కలిసి కేటీఆర్‌ను కలిశారు. ప్రోత్సాహకంగా లక్ష రూపాయల చెక్కును అందించి అభినందించారు. అభిషేక్‌ తయారు చేసిన యంత్రానికి పేటెంట్‌ పొందేందుకు భవిష్యత్తులో మరిన్ని అవిష్కరణలు చేసేందుకు రాష్ట్ర స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్‌ తెలిపారు.

తనది వ్యవసాయ కుటుంబమని తల్లిదండ్రులు ధాన్యాన్ని ఎత్తేందుకు మరో నలుగురితో కలసి పడుతున్న కష్టం ఈ పరికరాన్ని తయారు చేసేందుకు స్ఫూర్తి కలిగించిందని అభిషేక్‌ చెబుతున్నాడు. భవిష్యత్తులో ఐఏఎస్‌ కావాలన్నది తనకున్న ఆకాంక్ష అని చెప్పాడు. బాలమేధావి అభిషేక్ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories