ఓలాకు షాక్‌.. ఆరు నెలల నిషేధం

ఓలాకు షాక్‌.. ఆరు నెలల నిషేధం
x
Highlights

ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలాకు భారీ షాక్ తగిలింది. ఓలా నిబంధనలకు అతిక్రమించిందని ఓలా సంస్థ లైసెన్స్‌లను 6నెలల పాటు రద్దు చేస్తున్నట్లు...

ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలాకు భారీ షాక్ తగిలింది. ఓలా నిబంధనలకు అతిక్రమించిందని ఓలా సంస్థ లైసెన్స్‌లను 6నెలల పాటు రద్దు చేస్తున్నట్లు కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతో దీంతో కర్ణాటకలో ఆరునెలలు ఓలా సర్వీసులు బంద్ కానున్నాయి. పద్దతులను అతిక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండానే ఓలా బైక్ ట్యాక్సీని నడుపుతుందని కర్ణాటక రవాణ శాఖ తెలిపింది. దీనిపై వివరణ కోరామని అయితే సంస్థ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని తెలిపింది. కర్టాటక రవాణ చట్టం 2016 ప్రకారం ఆ సంస్థ లైసెన్స్‌లను మొత్తం ఆరు నెలలు రద్దు చేస్తున్నట్లు ఆదేశాలను జారీ చేశారు. ఆర్డ‌ర్ కాపీ అందిన మూడు రోజుల్లోనే లైసెన్సును అప్పగించలని ఓలా కంపెనీని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories