మూడో జాబితా విడుదల చేసిన జనసేన

మూడో జాబితా విడుదల చేసిన జనసేన
x
Highlights

జనసేన పార్టీ మూడో జాబితాను ప్రకటించింది. 13 మందికి ఈ జాబితాలో చోటుదక్కింది. సోమవారమే పార్టీలో చేరిన గుణ్ణం నాగబాబుకు పాలకొల్లు టికెట్ కేటాయించారు...

జనసేన పార్టీ మూడో జాబితాను ప్రకటించింది. 13 మందికి ఈ జాబితాలో చోటుదక్కింది. సోమవారమే పార్టీలో చేరిన గుణ్ణం నాగబాబుకు పాలకొల్లు టికెట్ కేటాయించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా పనిచేసిన నాగబాబు టిక్కెట్టు దక్కకపోవడంతో జనసేనలో చేరారు.

జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను అర్ధరాత్రి ప్రకటించింది. ఈ జాబితాలో ఒంగోలు లోక్ సభ స్థానంతోపాటు 13 మంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జగన్ పార్టీ నుంచి తాజాగా జనసేనలో చేరిన గుణ్ణం నాగబాబుకు పాలకొల్లు టికెట్ కేటాయించారు. వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా పనిచేసిన ఆయన టికెట్ దక్కకపోవడంతో జనసేనలో చేరారు.

అయితే, ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానంలో మార్పు చేసినట్టు జనసేన స్పష్టం చేసింది. షేక్ రియాజ్ గిద్దలూరు నుంచి పోటీ చేస్తారని ముందుగా ప్రకటించగా ఆయన ఒంగోలు నుంచి పోటీ చేస్తారని తెలిపింది. గిద్దలూరు భైరబోయిన చంద్ర శేఖర్ యాదవ్ పోటీ చేస్తారని స్పష్టం చేసింది.

తాజాగా విడుదలైన జాబితాలో ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా బెల్లంకొండ సాయిబాబును ప్రకటించారు. అసెంబ్లీ అభ్యర్థులు చూస్తే...టెక్క‌లి - క‌ణితి కిర‌ణ్ కుమార్, పాల‌కొల్లు - గుణ్ణం నాగ‌బాబు, గుంటూరు ఈస్ట్ - షేక్ జియా ఉర్ రెహ్మాన్, రేప‌ల్లె - క‌మ‌తం సాంబ‌శివ‌రావు, చిల‌క‌లూరిపేట - మిరియాల ర‌త్న‌కుమారి, మాచ‌ర్ల - కె. ర‌మాదేవి, బాప‌ట్ల - పులుగు మ‌ధుసూధ‌న్ రెడ్డి, ఒంగోలు - షేక్ రియాజ్, మార్కాపురం - ఇమ్మ‌డి కాశీనాథ్, గిద్ద‌లూరు - బైర‌బోయిన చంద్ర‌శేఖ‌ర్ యాద‌వ్, పొద్దుటూరు - ఇంజా సోమ‌శేఖ‌ర్ రెడ్డి, నెల్లూరు అర్బ‌న్ - కేతంరెడ్డి వినోద్ రెడ్డి , మైదుకూరు - పందిటి మ‌ల్హోత్ర‌ , క‌దిరి - సాడ‌గ‌ల ర‌వికుమార్‌లను ఖరారు చేసింది జనసేన. ఈ మూడో జాబితాతో కలిపితే ఇప్పటి వరకూ జనసేన అభ్యర్థుల సంఖ్య 77కి చేరింది. మరి పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories