జల్లికట్టులో అపశృతి.. 49మందికి గాయాలు

జల్లికట్టులో అపశృతి.. 49మందికి గాయాలు
x
Highlights

తమిళనాడుకట్టు పోటీల్లో అపశృతి దొర్లింది. మధురై జిల్లాలో నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో ఎద్దులు ప్రేక్షకులపైకి దూసుకళ్ళాయి. ఈ ఘటనలో 43 మందికి పైగా గాయపడ్డారు.

తమిళనాడుకట్టు పోటీల్లో అపశృతి దొర్లింది. మధురై జిల్లాలో నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో ఎద్దులు ప్రేక్షకులపైకి దూసుకళ్ళాయి. ఈ ఘటనలో 43 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు ప్రారంభమైంది.మధురై జిల్లాలో జల్లి కట్టు పోటీలు జోరుగా జరిగాయి. మధురై, పాలమేడులో భారీగా జల్లికట్టు ఆడారు. మధురైలో మొత్తం 988 ఎద్దులు పోటీల్లో పాల్గొనగా 848 మంది యువకులు ఎద్దుల క్రీడ ఆడారు. తమిళనాడులో తొలిసారి మధురైలో జల్లికట్టులో పాల్గొనే వారికి బీమా నిబంధన పెట్టారు. ఎద్దుల పోటీలో గెలిచిన వారికి బంగారు నాణేలు, బైక్స్, కారు కూడా బహుమతులుగా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు.

మధురైలో జల్లికట్టు ప్రారంభమైన కొద్ది సేపటికి ఊహించని ఘటన జరిగింది. ఎద్దులు ఆటలో పాల్గొనేవారిపైకి, ప్రేక్షకులపైకి దూసుకు రావడంతో 43 మంది గాయపడ్డారు. మరోవైపు చిత్తూరు జిల్లా రంగంపేటలో ఉత్సాహంగా జల్లికట్టు జరిగింది. 35 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. రంగంపేట జల్లికట్టులో గీత అనే మహిళ చరిత్ర సృష్టించింది.తమిళనాడులో కూడా ఎవరూ చేయని విధంగా ధైర్యసాహసాలతో జల్లికట్టులో పాల్గొంది. జల్లికట్టులో పాల్గొన్న గీత సాహసాన్ని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories