ఉగ్రమూకల మృత్యుక్రీడ

ఉగ్రమూకల మృత్యుక్రీడ
x
Highlights

కశ్మీర్‌ మరోసారి రక్తమోడింది. దేశ చరిత్రలోనే అత్యంత పాశవిక దాడికి పాల్పడ్డారు ఉగ్రమూకలు. పుల్వామాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు...

కశ్మీర్‌ మరోసారి రక్తమోడింది. దేశ చరిత్రలోనే అత్యంత పాశవిక దాడికి పాల్పడ్డారు ఉగ్రమూకలు. పుల్వామాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 40 కి పైగా జవాన్లు నేలకూలారు. గత 20 ఏళ్ల కాలంలో ఇంత దారుణమైన దాడి జరిగిన దాఖలాలు లేవని భద్రతా సిబ్బంది చెబుతున్నాయి.

జమ్మూకాశ్మీర్‌ మరోసారి రక్తమోడింది. అతిపెద్ద ఉగ్రదాడితో వణికిపోయింది. చరిత్రలో నిలిచిపోయేలా దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. జమ్ము నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ అవంతిపురా సమీపంలోకి చేరుకున్న సమయంలో దాడికి పాల్పడ్డారు. కాన్వాయ్‌లో మొత్తం 70 వాహనాలుండగా అందులో 2 వేల 500 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్నారు.

జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాది అదిల్‌ అహ్మద్‌ దాదాపు 350 కేజీల పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారుతో సీఆర్ఫీఎఫ్‌ కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టాడు. దీంతో భారీ విస్ఫోటనం సంభవించింది. దీంతో జవాన్లు ఒక్కసారిగా నేలకూరాలారు. క్షణాల్లోనే పదుల సంఖ్యలో ప్రాణాలు విడిచారు.

ఉగ్రవాదులు ముందుగా ఐఈడీ బాంబుతో దాడి‌చేసి ఆ తర్వాత తుపాకులతో విరుచుకుపడ్డారు. జవాన్లు తేరుకునేలోపే సూసైడ్ కారు బాంబుతో కాన్వాయ్‌పై విరుచుకుపడ్డారు. 350 కిలోల పేలుడు పదార్ధాలున్న కారుతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన ఉగ్రవాది ఆదిల్‌ అహ్మద్‌ తనను తాను పేల్చేసుకున్నాడు. బాంబు పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ వాహనం తునాతునకలైంది. జవాన్ల మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారి చెల్లాచెదురయ్యాయి.

గాయపడ్డవారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇటు దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. స్పాట్ దగ్గర భీతావాహ వాతావరణం నెలకొంది. రహదారి రక్తమోడింది. దాంతో జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేశారు. జమ్మూకశ్మీర్‌ మొత్తం హైఅలర్ట్‌ ప్రకటించిన ఆర్మీ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు జల్లెడపడుతోంది. పుల్వామా ఘటన గత 20 ఏళ్లలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా చెబుతున్న ఆర్మీ వర్గాలు 2004 ఉరి అటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories