వివేకా హత్య కేసు.. అదుపులో జగన్‌ అనుచరుడు

వివేకా హత్య కేసు.. అదుపులో జగన్‌ అనుచరుడు
x
Highlights

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. జగన్‌ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డితో పాటు.. నాగప్ప, కుమారుడు...

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. జగన్‌ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డితో పాటు.. నాగప్ప, కుమారుడు శివను సిట్ బృందం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. నిన్ననే కడప పార్లమెంట్‌ ఆర్జేడీ అభ్యర్థిగా శివశంకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. ఇప్పటికే శివశంకర్‌రెడ్డిని పోలీసులు రెండు సార్లు విచారించారు. పులివెందులకు చెందిన నాగప్ప, ఆయన కుమారుడు శివను కూడా పోలీసులు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని వివిధ రహస్య ప్రదేశాల్లో ప్రశ్నిస్తున్నారు. కేసు విచారణ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు, వివేకా హత్య జరిగిన రాత్రి 11.30 గంటల సమయంలో చిన్న అనే వ్యక్తికి చెందిన స్కార్పియో వాహనంలో చంద్రశేఖర్ రెడ్డి పులివెందులలో తిరిగినట్టు సీసీ కెమెరా ఫుటేజీల్లో పోలీసులు గుర్తించారు. హత్యకు పరమేశ్వర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలు ప్రధాన సూత్రధారులైతే... చంద్రశేఖర్ రెడ్డి అండ్ గ్యాండ్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసు విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories