ఈసీ... యూసీ.... పోటాపోటీ ఫిర్యాదులు

ఈసీ... యూసీ.... పోటాపోటీ ఫిర్యాదులు
x
Highlights

ఏపీలో ఈసికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ శాఖలతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం...

ఏపీలో ఈసికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ శాఖలతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సమీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ ఈసికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తోంది. అధికారిక భవనాల్లో సమావేశాలు పెట్టకూడదని, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదని కోడ్ చెబుతోందని, కానీ చంద్రబాబు అన్నింటికీ తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ద్వివేదీకి వివరించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు కోడ్ అమల్లో ఉంటుందని ఈ సమయంలో ఈసీ నిర్ణయాలను ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనంటున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు సమీక్షలు కోడ్ ఉల్లంఘనే అన్నారు. ఈసీ నిర్ణయాలు ఎవరికైనా వర్తిస్తాయన్నారు.

వైసీపీ ఫిర్యాదులపై ఎన్నికల కమిషన‌ సీఎస్ వివరణ కోరింది. ఏయే అంశాలపై సమీక్ష జరిపారు. ఎవరెవరూ పాల్గొన్నారు ? ముందుగా అనుమతులు తీసుకున్నారా ? లేదా అనే అంశాలపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు నిన్న సీఆర్‌డీఏపై సమీక్ష జరిపారు. అయితే ఈ సమావేశంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పాల్గొనలేదు. హోంశాఖతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించాలని భావించినా చివరి నిమిషంలో రద్దయ్యింది. సమీక్షకు హజరయ్యే విషయంలో సీఎస్ సూచన మేరకు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు నడుచుకోవడంతో సమీక్ష సమావేశాన్ని రద్దు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సమీక్ష సమావేశాలపై ఈసీ సైతం క్లారిటీ ఇచ్చింది. అత్యవసర సమయాల్లో మాత్రమే సమీక్షలు నిర్వహించవచ్చన్నారు. కోడ్ అమల్లో ఉండగా టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లు చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయన్నారు. ఇలాంటి సమావేశాలను ప్రచారానికి వాడుకోకుండా ఉండాలన్నారు. సమావేశంలో ఈసీ తరపు ప్రతినిధి కూడా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది వివరించారు.

ఓ వైపు ఈసీకి ఫిర్యాదులు చేస్తున్న వైసీపీ మరో వైపు సీఎస్‌కు కూడా లేఖాస్త్రం సంధించింది. ఏపీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులకు డబ్బు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఇజ్రాయిల్‌కు చెందిన వెరిన్ట్‌ సంస్ధకు 12.5 కోట్లు చెల్లించే ప్రయత్నాలు అడ్డుకోవాలంటూ కోరారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు ఇజ్రాయిల్ నుంచి ఈ పరికరాలను కొనుగోలు చేశారని ఆరోపించిన ఆయన ప్రభుత్వం కాగితాల్లో చూపుతున్న పనులకు ఆచరణలో చేస్తున్న కార్యక్రమాలకు పొంతన లేదన్నారు. ఇలాంటి వాటికి ఆదిలోనే అడ్డుకట్టు వేయాలంటూ తన లేఖలో కోరారు .

Show Full Article
Print Article
Next Story
More Stories