ఎల్బీ స్టేడియంలో కూలిన ఫ్లడ్‌లైట్‌ టవర్‌

ఎల్బీ స్టేడియంలో కూలిన ఫ్లడ్‌లైట్‌ టవర్‌
x
Highlights

హైదరాబాద్‌లో అకాల వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఎల్బీ స్టేడియంలో...

హైదరాబాద్‌లో అకాల వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్‌ టవర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో టవర్‌ కింద చిక్కుకుని ఒకరు మృతి చెందారు. నాలుగు కార్లు ధ్వంసం కాగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో ఎగ్జిబిషన్‌ షెడ్‌ కూలిపోయింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరుగుతున్నాయి.

మరికొన్ని చోట్ల హోర్డింగులు కూలిపోయాయి. రాణిగంజ్‌, పారడైజ్‌, ప్యాట్నీ, సంగీత్‌, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, వారాసిగూడ, చిలకలగూడ, పార్సిగూడ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఇక కుషాయిగూడ, కాప్రా, ఇసిఐఎల్‌, రాధిక, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈ ఏరియాలతో పాటు చందానగర్‌, మియాపూర్‌, లింగంపల్లి ప్రాంతాల్లోనూ కుండపోతన వాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. నేరెడ్‌మెట్, బోయిన్‌పల్లి, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, తార్నాక, లాలాపేట్, సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, హెచ్‌బీ కాలనీ, జవహార్‌నగర్, ముషీరాబాద్, చిలకలగూడ, బేగంపేట, కుత్బుల్లాపూర్, చింతల్, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, సురారం, కాప్రా, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మెహదీపట్నం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గాలులకు చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కూలిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఆర్‌డీపీ పనులు జరిగే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories