రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ వేసిన హరీష్ ..

రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ వేసిన హరీష్ ..
x
Highlights

టీఆర్ఎస్ లో హరీష్ రావు పాత్ర గురించి పెద్దగా చెప్పాలిసిన అవసరం లేదు .. టీఆర్ఎస్ లో కేసీఆర్ తరవాత కేసీఆర్ అనే పేరు ఆయన సొంతం. వ్యక్తిగతంగా కూడా హరీష్...

టీఆర్ఎస్ లో హరీష్ రావు పాత్ర గురించి పెద్దగా చెప్పాలిసిన అవసరం లేదు .. టీఆర్ఎస్ లో కేసీఆర్ తరవాత కేసీఆర్ అనే పేరు ఆయన సొంతం. వ్యక్తిగతంగా కూడా హరీష్ రావు కి మంచి పేరు ఉంది. అయితే కొన్ని రోజుల నుండి అయన పార్టీ మారుతారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయన కూడా వాటిని చాలా సార్లు కూడా కొట్టిపారేశారు కూడా .. ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే తగిని మూల్యం తగ్గించుకోవాల్సి ఉంటుందని అయన హెచ్చరించారు కూడా ..

కానీ అయన పై ఇలాంటి వార్తలకు పులిస్టాప్ తో ఆగడం లేదు. ఎదో రకంగా ఏదో విధంగా అయన పై కధనాలు వస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ నేతల సంఖ్యే ఎక్కువ . తాజాగా హరీష్ రావు మాకు టచ్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు . సమయం కోసం హరీశ్ రావు ఎదురుచూస్తున్నారని.. టీఆర్ఎస్ పార్టీకి ఆయన గండి కొట్టడం ఖాయమని చెప్పుకొచ్చారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హట్ టాపిక్ గా మారాయి.

అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమతో టచ్ లో ఉన్నారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులను జోడిస్తూ బిగ్ జోక్ అంటూ ట్వీట్ చేసారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories