తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
x
Highlights

తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 20 రాష్ట్రాల్లోని 91 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అ్యయింది. ఈనెల 10న 17వ లోక్‌సభ...

తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 20 రాష్ట్రాల్లోని 91 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అ్యయింది. ఈనెల 10న 17వ లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో 17ఎంపీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ , 175 అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.

నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు 8రోజులు వ్యవధి ఉన్నా ఇందులో రెండు సెలవు దినాలు ఉన్నాయి. ఆరు రోజులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.

26న నామినేషన్ల పరిశీలన, 28వరకు ఉపసంహరణకు తుది గడువు నిర్ణయించారు. తర్వాత పోటీ ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. పోలింగ్ ముగిసే సమయానికి 48గంటల ముందే ప్రచారాన్ని ముగించాల్సి ఉన్నందున ఏప్రిల్ 9న సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం చేయాలి. బ్యాలెట్‌పై అభ్యర్థులు ఖరారయ్యాక ప్రచారానికి కేవలం 12 రోజులు మాత్రమే ఉంటుంది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 23న నిర్వహిస్తారు.

ఎన్నికల్లో నియమావళిని ఉల్లంఘించవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలన్నీ అంగీకరించిన మార్గదర్శక సూత్రాలను నిబంధనల్లో చేర్చినట్టు తెలిపింది. మంత్రులు అధికారిక వాహనాలను ప్రచారానికి వినియోగించరాదని, అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలు చేయవద్దని పేర్కొంది. నామినేషన్ల దాఖలుకు వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలకు అనుమతిస్తామని, అభ్యర్థి సహా ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని తెలిపింది.

మూహుర్తాల ప్రకారం ఇవాళ ద్వాదశి, 22న విదియ, 23న తదియ, 25న పంచమి మంచిరోజులుగా భావిస్తూ ఆ తేదీల్లో ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు వేయబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories