హార్దిక్‌పటేల్ చెంప చెల్లుమనిపించిన వ్యక్తి

హార్దిక్‌పటేల్ చెంప చెల్లుమనిపించిన వ్యక్తి
x
Highlights

పాటీదార్ ఉద్యమనేత, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ హార్దిక్‌పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని...

పాటీదార్ ఉద్యమనేత, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ హార్దిక్‌పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని సురేందర్‌నగర్‌లో హార్దిక్‌పటేల్ నేడు పర్యటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హార్దిక్ పాల్గొని మాట్లాడుతుండగా ఓ వ్యక్తి స్టేజిపైకి వచ్చి హార్దిక పటేల్ చెంప చెల్లుమనిపించాడు. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సదరు వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. మూకదాడిలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హార్దిక్‌పై జరిగిన దాడిపై వెంటనే విచారణ జరిపించాల్సిందిగా ఫిర్యాదులో కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories