సత్వరమే బిల్లులు చెల్లిస్తాం

సత్వరమే బిల్లులు చెల్లిస్తాం
x
Highlights

సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం. రాబోయే ఐదేళ్లలో మొత్తం ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. నీటిపారుదలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కోటీ పాతిక లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం. రాబోయే ఐదేళ్లలో మొత్తం ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. నీటిపారుదలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కోటీ పాతిక లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే నెలలో మరోసారి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నట్లు తెలిపారు.

కోటీ పాతిక లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా కంప్లీట్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రైతులకు సాగునీరు అందించడం కంటే మించిన ప్రాధాన్యత లేదన్న కేసీఆర్‌. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మించడంతోపాటు పెద్దవాగు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి సమగ్ర వ్యూహం రూపొందించుకుని పనులు చేపట్టాలని ఆదేశించారు.

రెండు లక్షల 25వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతోన్న సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు 77వేల 777కోట్లు ఖర్చు చేయగా, భూసేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, ఆర్‌ఆర్ ప్యాకేజీల కోసం మరో 22వేల కోట్లు వ్యయం చేశారు. మొత్తం 99వేల 643కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు పెట్టారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. వెంట వెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి మరో 7వేల కోట్లకు పైగా వ్యయం చేయనున్నారు. దాంతో ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేనాటికి మొత్తం లక్షా 7వేల కోట్లు ఖర్చు చేసినట్లు అవుతుంది.

రాబోయే ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి కోటీ పాతిక లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అలాగే ఫిబ్రవరిలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories