టార్గెట్‌ పూర్తి చేయలేదని ఉద్యోగులకు వింత శిక్ష

టార్గెట్‌ పూర్తి చేయలేదని ఉద్యోగులకు వింత శిక్ష
x
Highlights

సర్వ సాధరణంగా ప్రయివేటు కంపెనీల్లో కొలువు చేసే వారికి తప్పకుండా టార్గెట్ అనేది పెడుతుంటారు. కాగా ఇచ్చిన సమయానికి ఆ టార్గెట్‌ని పూర్తిచెయ్యాకపోతే మాములుగా అయితే జీతం తక్కువ ఇవ్వడమో లేక ఇంకో రెండు గంటలు ఎక్కువ పనిచేయిస్తారు.

సర్వ సాధరణంగా ప్రయివేటు కంపెనీల్లో కొలువు చేసే వారికి తప్పకుండా టార్గెట్ అనేది పెడుతుంటారు. కాగా ఇచ్చిన సమయానికి ఆ టార్గెట్‌ని పూర్తిచెయ్యాకపోతే మాములుగా అయితే జీతం తక్కువ ఇవ్వడమో లేక ఇంకో రెండు గంటలు ఎక్కువ పనిచేయిస్తారు. ఇక ఇదంత కాదుఅనుకుంటే మొత్తానికే వారి కొలువునుండి తీసిపరేస్తారు పలు కంపెనీల యాజమాన్యాలు. ఇగ ఇప్పుడు మీరు జీవితంలోనే కనివిని ఎరుగని రీతిలో శిక్ష విధించారు చైనాలోని ఓ కంపెనీ. అసలు అంత పెద్ద శిక్ష ఎంటనుకుంటున్నారా! ఇయర్ ఎండింగ్ టార్గెట్ పూర్తి చేయలేదని ఏకంగా నడిరోడ్డుపై పట్టపగలు అందరూ చూస్తుండగానే ఉద్యోగులను మోకాళ్లపై నడిపించారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లు ఆశ్చర్యపోయారు. ఓ పెద్ద మనిషి ఈ ఘటనను మొళ్లీగా వీడియో తీసి సోషల్ నెట్‌వర్క్‌లో పెట్టాడు ఇక దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు దూమ్మురేపుతుంది. అయితే ఈ వీడియో చూసిన జనాలు కంపెనీపై దుమ్మెత్తి పోస్తున్నారు. మరికొందరూ ఆ కంపెనీ శిక్ష విధిస్తే మాత్రం పైసల కోసం గింతగనం దిగజారాలా అని విమర్శిస్తున్నారు. తీవ్ర విమర్శలతో సప్పుడు చేయకుండా కంపెనీనే తత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. ఇలాంటి ఘటనే గతంలో కూడా చోటుచేకుంది. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయ్యాలేదని అమ్మయిలతో వరుసపెట్టి చెంపదెబ్బలు కొట్టించారు. అయితే ఈ చైనాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కాని అక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories