ఏపీ సీఎం జగన్ నేమ్ ప్లేట్‌పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..

ఏపీ సీఎం జగన్ నేమ్ ప్లేట్‌పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..
x
Highlights

తిరుపతిలో పుట్టిన రోజు వేడుకలకు హాజరైన ఆపద్దర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్నికల తర్వాత పరిణామాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే...

తిరుపతిలో పుట్టిన రోజు వేడుకలకు హాజరైన ఆపద్దర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్నికల తర్వాత పరిణామాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో నేమ్ ప్లేట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాబోయే సీఎం అంటూ నేమ్ బోర్డ్‌లు రాయడం చూశాం అసలు నిజం తెలియడంతో వైసీపీ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు.గెలవమని ఆ పార్టీ నేతలకు కూడా అర్దమైపోయిందన్నారు. ఎన్నికల ముగిసిన వెంటనే గెలిచినట్లు వైసీపీ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు

వ్యక్తిగతంగా తనకు ఈసీతో ఎలాంటి సమస్య లేదని రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కోడ్‌ ఒక్క టీడీపీ ప్రభుత్వానికే వర్తిస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మైండ్‌ గేమ్‌ ఆడుతుందని ఏపీ ముఖ్యమంత్రి అంటూ బోర్డులు కూడా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఎక్కడా రాజీపడలేదన్నారు చంద్రబాబు. తిరుపతి నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించానని ప్రజా సమస్యలపై విద్యార్థి దశ నుంచి సీఎంగా పోరాటం చేస్తున్నానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories