బీజేపీకి సికింద్రాబాద్...కాంగ్రేస్‌కు నల్గొండ...

బీజేపీకి సికింద్రాబాద్...కాంగ్రేస్‌కు నల్గొండ...
x
Highlights

తెలంగాణలో రెండు జాతీయపార్టీలకు అభ్యర్థుల ఎంపిక కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి నల్గొండ అభ్యర్థి ఎంపిక ఇబ్బందిగా మారితే...

తెలంగాణలో రెండు జాతీయపార్టీలకు అభ్యర్థుల ఎంపిక కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి నల్గొండ అభ్యర్థి ఎంపిక ఇబ్బందిగా మారితే బీజేపీకి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో తజ్జన పడుతోంది. దీంతో రెండుపార్టీల అధిష్టానం తలలు పట్టుకోంటుంది.

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయాల్లో టెక్షన్ పుడుతోంది. ఇవాళ్టి నుంచి నామినేషన్లు కూడా స్వీకరించనున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలు మాత్రం అభ్యర్థుల ప్రకటనలో తజ్జన, బజ్జన పడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం చిక్కుముడిగా మారింది. కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సికింద్రాబాద్ స్థానం కోసం పట్టుబడుతుంటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురవుతోంది.

ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రేస్ పార్టీలో కూడ ఒక సీటులో అభ్యర్దిని తేల్చలేక తలలు పట్టుకుంటోంది. నిన్న మొన్నటి వరకు నల్గొండ పార్లమెంటు స్థానానికి మాజీ మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి పోటి చేస్తాడని పార్టీ భావించింది. అనూహ్య పరిణామాలతో కోమట్ రెడ్డి భువనగిరికి మారడంతో. నల్గొండ సీటు అభ్యర్థి కోసం కొత్తపేర్లు తెరపైకి వచ్చాయి. ఈ స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోటీ చేయమని అధిష్టానం ఆదేశించగా ఉత్తం పోటీకి నిరాకరించినట్లు తెలుస్తోంది. తాను పోటీ చేస్తే హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఇబ్బంది అవుతుందని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు జానారెడ్డి కుటుంబం నల్గొండ టికెట్టుపై ఆశలు పెట్టుకునట్లు తెలుస్తోంది. అయితే ఉత్తమ్ పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

మొత్తానికి రెండు జాతీయ పార్టీలకు ఒక్కో పార్లమెంట్ స్థానం ఇబ్బందిగా మారడంతో రెండు పార్టీల అధిష్టానం అభ్యర్థులను ఫైనల్ చేసే భాద్యతలను తీసుకునట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు నియోజికవర్గాలకు ఎవర్ని ఫైనల్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories