అవంతికి భీమిలి అసెంబ్లీ సీటు, మంత్రి పదవి ఆఫర్‌ ?

అవంతికి భీమిలి అసెంబ్లీ సీటు, మంత్రి పదవి ఆఫర్‌ ?
x
Highlights

ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసిన అవంతి నిన్న లోటస్ పాండ్ లో జగన్...

ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసిన అవంతి నిన్న లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అవంతి శ్రీనివాస్ కు పార్టీ కండువా కప్పీ, వైసీపీలోకి ఆహ్వానించారు.

విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాస్‌ లోక్‌సభ చివరి సమావేశాలు ముగిసిన మరుసటి రోజే పార్టీ మారారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. అనంతరం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, బొత్స సత్యనారాయణ ఆయనతో సమావేశమై చర్చించారు. వారితో కలిసి లోటస్‌ పాండ్‌కు వెళ్లిన అవంతి శ్రీనివాస్‌కు జగన్‌ వైసీపీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

జగన్ కమిట్మెంట్ నచ్చి, వైసీపీలో చేరానని అవంతి శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి జగన్ ఒకే మాటపై ఉన్నారని చంద్రబాబు మాత్రం మాట మార్చారన్నారని ఆరోపించారు. టీడీపీలో అవినీతి, బంధు ప్రీతి పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు మాటలు విని విసిగిపోయారని అవంతి అన్నారు. భీమిలి ఎమ్మెల్యే టికెట్‌తో పాటు పార్టీ అధికారంలోకి వస్తే, మంత్రి పదవి ఇస్తామని అవంతి శ్రీనివాస్‌కు జగన్ నుంచి గట్టి హామీ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories