ఏపీలో మహిళా ఓట్లు పెరగడానికి కారణమేంటి?

ఏపీలో మహిళా ఓట్లు పెరగడానికి కారణమేంటి?
x
Highlights

తెలుగు రాష్ట్రాల చరిత్రలో నవ్యాంధ్రప్రదేశ్ రెండోసారి ఏకకాల ఎన్నికలకు సిద్ధమవుతోంది. 13 జిల్లాలు, 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలతో కూడిన...

తెలుగు రాష్ట్రాల చరిత్రలో నవ్యాంధ్రప్రదేశ్ రెండోసారి ఏకకాల ఎన్నికలకు సిద్ధమవుతోంది. 13 జిల్లాలు, 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ కు ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఓటు హక్కు వినియోగించుబోతున్నారు. ఇంతకూ ఏపీ ఓటర్లలో పురుషుల కంటే మహిళలే ఎందుకు ఎక్కువ?

నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో రెండోసారి ఎన్నికలకు నగారా మోగింది. 2014లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకొంటే ఐదేళ్ల తర్వాత అదీ ఏప్రిల్ 11న పార్లమెంట్, శాసనసభలకు ఏకకాలం లో జరుగనున్న ఎన్నికల్లో రెండు జాతీయపార్టీలతో సహా మొత్తం ఐదు పక్షాలు ఢీ అంటీ ఢీ అంటున్నాయి. బీజెపీ,కాంగ్రెస్ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోడానికి మాత్రమే బరిలోకి దిగుతుంటే అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతో పాటు జనసేన సైతం పోటీకి సై అంటోంది.

ఈ ఎన్నికల్లో మొత్తం 3 కోట్ల 70 లక్షల మంది ఏపీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తం 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లలో 2 కోట్ల 80 లక్షలమంది మహిళలే కావటం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 13 జిల్లాలలో తూర్పుగోదావరి అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాగా రికార్డుల్లో చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో 40 లక్షల 13వేల మంది ఓటర్లు ఉన్నారు. తూర్పుగోదావరి తర్వాత అత్యధికమంది ఓటర్లు ఉన్న జిల్లాగా గుంటూరు నిలిచింది. గుంటూరు జిల్లాలో 37 లక్షల 46వేల మంది ఓటర్లు ఉన్నారు.

గత ఎన్నికల్లో 7 శాతం లోక్ సభ ఓట్లు, 2 శాతం అసెంబ్లీ ఓట్లు సాధించిన బీజెపీ ప్రస్తుత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 102 స్థానాలు సాధించిన అధికార టీడీపీ, 67 స్థానాలు నెగ్గిన ప్రతిపక్ష వైసీపీల మధ్య పోటీ హోరాహోరీగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఏదిఏమైనా నవ్యాంధ్రప్రదేశ్ దశదిశను ఈ ఎన్నికల ఫలితాలే సమూలంగా మార్చి వేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories