అక్కడ వర్తించని 'కోడ్'‌..ఏపీకెందుకు?: నారా లోకేశ్‌

అక్కడ వర్తించని కోడ్‌..ఏపీకెందుకు?: నారా లోకేశ్‌
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈసీ తీరుపై టీడీపీ పార్టీ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో...

ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈసీ తీరుపై టీడీపీ పార్టీ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఈసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఆంక్షలన్నీ ఒక్క తెలుగుదేశం పార్టీకే వర్తిస్తాయా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ప్రభుత్వ పరంగా చేసే సమీక్షలపై ఈసీ ఆంక్షలు విధించటంపై ట్విటర్‌ వేదికగా నారాలోకేశ్ స్పందించారు. ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా అంటూ ప్రశ్నించారు. ఎండాకాలంలో తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తే ఈసీకి వచ్చిన ఇబ్బందేంటి? అని ప్రశ్నించారు. సమీక్ష చేసి చర్యలు తీసుకునే అధికారం లేకపోతే ఎండా కాలంలో ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జరిపే సమీక్షల్లో ప్రభుత్వ సీఎస్ తో పాటు డీజీపీ కూడా పాల్గొంటున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అక్కడ వర్తించని కోడ్ ఏపీకి ఎందుకని లోకేశ్‌ నిలదీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories