ఫిర్యాదుతో సమావేశం దిశ మార్చుకున్న టీడీపీ నేతలు..

ఫిర్యాదుతో సమావేశం దిశ మార్చుకున్న టీడీపీ నేతలు..
x
Highlights

ఎన్నికలు అయిపోయి 10 రోజులు గడుస్తున్నా ఆ వేడి మాత్రం ఏపీలో తగ్గలేదు. ఎన్నికల నిర్వహణ, ఈసీ పని తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత...

ఎన్నికలు అయిపోయి 10 రోజులు గడుస్తున్నా ఆ వేడి మాత్రం ఏపీలో తగ్గలేదు. ఎన్నికల నిర్వహణ, ఈసీ పని తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వాధికార భవనాల్లో ఏవిధంగా నిర్వహిస్తారని వైసీపీ ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. దీంతో సమావేశం దిశ మార్చుకున్న టీడీపీ... కేవలం అధికారిక కార్యక్రమాల కోసమే అని చెప్తోంది. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగింది. ఈ సమావేశానికి 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు, 175మంది అసెంబ్లీ అభ్యర్థులతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. సమావేశం ప్రధాన ఎజెండా ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల పనితీరు, పార్టీ గెలుపుపై చర్చ, ఓటింగ్ రోజు నిర్వహించాల్సిన అంశాలపై ప్రధానముగా చర్చించారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వ అధికారిక భవనాల్లో పార్టీ సమావేశాలు ఏవిధంగా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈసీకి లేఖ రాశారు. దీంతో టీడీపీ సమావేశం కాస్తా దశ దిశ మార్చుకుని కేవలం రాష్ట్ర పరిస్థితులపై చర్చించే వేదికగా మారింది. అయితే సీఎ సమావేశం విషయాలు బయటికి రాకుండా చూస్తున్నారని, అభ్యర్థులను అడిగితే నీటి ఎద్దరి గురించి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్టు తెలిపారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక ఈ విషయంపై వైసీపీకి ఈసీకి ఫిర్యాదు చేసే అర్హత లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఎలా ఫిర్యాదు చేస్తారని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబు సమావేశాలు కోడ్‌ ఉల్లంఘనే అని ఆరోపిస్తోంది వైసీపీ. అయితే రాష్ట్రాభివృద్ధి కోసమే తాము సమావేశం నిర్వహిస్తే కోడ్‌ ఉల్లంఘన ఎలా అవుతుందని తిరిగి ప్రశ్నిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories