logo

Read latest updates about "తాజా వార్తలు" - Page 2

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ గవర్నర్ ప్రసంగం

2019-01-19T07:17:59+05:30
తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు గవర్నర్ నర్సింహన్ ప్రసంగించనున్నారు. ఉదయం పదకొండున్నరకు గవర్నర్ స్పీచ్ ప్రారంభం కానుంది. దాదాపు 40 నిమిషాలపాటు ప్రసంగించనున్న గవర్నర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతిని వివరించనున్నారు.

సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్క

2019-01-18T21:22:52+05:30
తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. గత మూడ్రోజులుగా సీఎల్పీ నేతగా ఎవర్ని ప్రకటించాలనే విషయంపై అధిష్టానం కాంగ్రెస్ నేతలు చర్చించారు.

ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే...!

2019-01-18T20:26:11+05:30
సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగనుంది. మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది.

బీజేపీకి కొత్త అర్థం చెప్పిన కేటీఆర్

2019-01-18T20:04:53+05:30
తెలంగాణ రాష్ట్రం ఆశించిన విధంగా శరవేగంగా అభివృద్ధి చేందాలంటే కేంద్రాన్ని కూడా శాసించాలని కేటీఆర్ అన్నారు. బీజేపీ పార్టీకి కొత్త అర్థం చెప్పారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా..

2019-01-18T19:40:08+05:30
ఈ నెల 30 నుంచి జరగాల్సిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. పింఛన్ల పంపిణీ, కొత్త పథకాల ప్రకటన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారు.

కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు.. ఒంటరిగానే పోటీ

2019-01-18T19:37:27+05:30
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ శాఖ కన్వీనర్ గోపాల్ రాయ్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని తెలిపారు.

కేసీఆర్ ఒక్క గిఫ్ట్‌కు‌‌ మేం మూడు గిఫ్ట్‌లు ఇస్తాం..

2019-01-18T18:49:47+05:30
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఒక రిటర్న్ గిఫ్ట్ కు మూడు గిప్టులు ఇస్తామన్నారు. గిఫ్ట్ కోసం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కేసీఆర్ ఎంచుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఆ నలుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ మాజీ సీఎం హెచ్చరిక

2019-01-18T18:19:00+05:30
కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంలో, కీలకమైన కాంగ్రెస్ బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. కాని ఈ సమావేశానికి మాత్రం నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మకొట్టారు.

ఆలస్యమైనా ఒంటేరు మంచి నిర్ణయం..: కేటీఆర్

2019-01-18T18:08:50+05:30
తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌ లోకి వలసలు ఊపందుకున్నాయి. గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీచేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గులాబీ దళంలోకి వంటేరు..

2019-01-18T17:39:33+05:30
కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకే తాను టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు.

30 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ

2019-01-18T17:30:33+05:30
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్ ను చంద్రబాబు ప్రారంభించారు.

మోడీ లేకుంటే చంద్రబాబు జీరో: సోము వీర్రాజు

2019-01-18T16:37:01+05:30
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే ఒకరి మీద మరోకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తప్పకుండా ఏపీ ప్రజలు తగిన బుద్దిచెబుతారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు.

లైవ్ టీవి

Share it
Top